రిషబ్ పంత్ ఓపెనర్ అయితే బాగుంటుంది : వసీం జాఫర్

praveen
ఇటీవల ఇంగ్లాండ్లో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో రిషబ్ పంత్ అదరగొట్టాడు అనే విషయం తెలిసిందే. రెండు మ్యాచ్ లలో కూడా మెరుగైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో 146 పరుగులు రెండో ఇన్నింగ్స్ లో 57 పరుగులు చేసి టీమిండియాను ఆదుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే కరోనా వైరస్ కారణంగా  ఇంగ్లాండ్తో జరిగిన ఐదవ మ్యాచ్ లో దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు పొట్టి ఫార్మాట్ సిరీస్కు అందుబాటులో రాబోతున్నాడు అని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 ఇంగ్లాండ్తో టీమిండియా ఆడబోయే పొట్టి ఫార్మాట్లో రోహిత్ శర్మ కు జోడీగా ఓపెనర్గా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ను పంపించాలి అంటూ బిసిసిఐకి సూచనలు చేశాడు.  మిడిలార్డర్లో మాత్రమే కాదు ఓపెనర్గా కూడా రిషబ్ పంత్ రాణించగలడు అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అనంతరం  టీమ్ ఇండియా పెద్దలు రిషబ్ పంత్  ఓపెనర్గా పంపే విషయం ఆలోచించాలి అంటూ వ్యాఖ్యానించాడు. రిషబ్ పంత్ సక్సెస్ అవుతాడు అని అనిపిస్తుంది అని  అభిప్రాయం వ్యక్తం చేశాడు. అక్టోబర్లో ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం మాజీ క్రికెటర్లు టీమిండియాకు పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు.



 ఈ క్రమంలోనే స్పందించిన వసీం జాఫర్ ఇక ఓపెనర్గా రిషబ్ పంత్ ని పంపిస్తే బాగుంటుందని  అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో రిషబ్ పంత్ అడుగుపెట్టి ఎన్నో రోజులు అవుతున్నా ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ఓపెనర్గా బరిలోకి దిగలేదు అన్న సంగతి తెలిసిందే. ఆరుసార్లు మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఇక 4,5 స్థానాల్లో అతడి ఎక్కువసార్లు బ్యాటింగ్ చేశాడు అని చెప్పాలి.  సక్సెస్ రేటు కూడా ఆ స్థానంలో బ్యాటింగ్ చేసిన సమయంలోనే రావడం గమనార్హం. ఇకపోతే రోహిత్ శర్మ జట్టులోకి ఓపెనింగ్ జోడి గా ఎవరిని పంపించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: