వైరల్ : పొదల్లోకి వెళ్లిన క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?

praveen
సాధారణంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్ అంటే సిక్సర్లు ఫోర్ల కి కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్ మెన్ కూడా బౌలర్ల పై  వీర విహారం చేస్తూ భారీగా పరుగులు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.   ఇక అటు బౌలర్లు బ్యాట్స్మెన్లను కట్టడి చేయడం ఎంతో సవాళ్లతో కూడుకున్న పని. అయితే కొన్ని కొన్ని సార్లు బ్యాట్స్మెన్లు కొట్టే సిక్సర్లు  మ్యాచ్ మొత్తానికి హైలైట్ గా మారిపోతూ ఉంటాయి.  ఎక్కడ ఇలాంటిదే జరిగింది. ఒక బ్యాట్స్ మెన్  కొట్టిన బంతి కాస్త చివరికి క్రికెటర్లను పొదల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి తీసుకు వచ్చింది. అదేంటి బ్యాట్స్మెన్ సిక్సర్ కొడితే ఫీల్డర్లు పొదల్లోకి ఎందుకు వెళ్లిపోయారు అని అనుకుంటున్నారు కదా..


ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం ఇంగ్లాండ్ నెదర్లాండ్స్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో భాగంగా ఇంగ్లాండ్ జట్టు టాస్ ఓడిపోయింది. దీంతో ప్రత్యర్థి జట్టు ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అయితే కేవలం ఒక్క పరుగు సమయంలో జాసన్ రాయ్ లాంటి కీలకమైన బ్యాట్స్మెన్ను కోల్పోయింది.. ఏం ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్ మలన్.. ఫిలిప్ సాల్ట్ వేగంగా పరుగులు తీస్తూ వచ్చారు. డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఇద్దరు క్రికెటర్లు. ఈ క్రమంలోనే డేవిడ్ మలాన్ కొట్టిన ఒక సిక్సర్ మాత్రం ఒక పెద్ద డ్రామాకు తెరతీసింది అని చెప్పాలి.



 డేవిడ్ మలాన్ కొట్టిన సిక్సర్ ఏకంగా ఒక పొదల్లోకి వెళ్ళింది. అక్కడ కనిపించకుండా పోయింది. బంతి కోసం నెదర్లాండ్స్  ఆటగాళ్లు మైదానం నుంచి బయటకు వెళ్ళిపోయి పొదల్లో బంతి కోసం వెతుకుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇలాంటి ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ లో సమయంలో ఇలాంటి సీన్ జరిగింది అనేది తెలుస్తుంది. మైదానం సరిహద్దుల్లోని బంతి పడటంతో సిబ్బంది ఆటగాళ్లు బంతి కోసం ఎంతో తీవ్రంగా వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఇక ఈ మ్యాచ్లో 90 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు డేవిడ్ మలాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: