ఇంగ్లాండ్ టీంఇండియా.. కానీ రోహిత్ ఎక్కడ?
గత ఏడాది ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన టెస్ట్ సిరీస్లో భాగంగా ఐదో టెస్టు మ్యాచ్ కరోనా కారణంగా వాయిదా పడింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక సీనియర్ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా జట్టు ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరింది. ఈ క్రమంలోనే జూలై 1 నుంచి 5వ తేదీ లో చివరి టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది అనేది తెలుస్తుంది. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా ఒక టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇక మూడు టెస్టు మ్యాచుల్లో రెండింటిలో విజయం సాధించిన టీమిండియా ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఒక టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత టీ20 వన్డే సిరీస్ లను కూడా అక్కడే ఆడనుండి టీమిండియా.
ఈ క్రమంలోనే విశ్రాంతి లో ఉన్న విరాట్ కోహ్లీ బుమ్రా సహా శుభమాన్ గిల్, చటేశ్వర పూజారా, మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ రవీంద్ర జడేజా విమానంలో ఇంగ్లాండుకు వెళ్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే బిసిసిఐ ఇలా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలలో అటు కెప్టెన్ రోహిత్ శర్మ కనిపించకపోవడంతో హిట్ మాన్ అభిమానులు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు అనే చెప్పాలి. కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్కడ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే అటు ఇంగ్లాండ్ జట్టు కి ఇటు టీమిండియా జట్టు కి కెప్టెన్లు, కోచ్ లు కొత్త వారు కావడంతో ఇక ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.