మూడో టీ20 మ్యాచ్.. టీమిండియాలో మూడు మార్పులు?

praveen
సౌత్ ఆఫ్రికాను సొంత గడ్డపై చిత్తుచిత్తుగా ఓడింస్తుంది అనుకున్న టీమిండియా అభిమానులను కూడా ఎంతగానో నిరాశపరిచింది. సరైన ప్రదర్శన చేయలేక ఘోర ఓటమి చవిచూసింది. టి20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా టీమిండియా ఆడిన తొలి రెండు మ్యాచ్ లలో కూడా ఘోర పరాభవం మూట కట్టుకుంది టీమిండియా. ఈ క్రమంలోనే మూడవ టీ20 మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.  కేవలం మూడవ టి20 మ్యాచ్ మాత్రమే కాదు ఇక నుంచి ప్రతి మ్యాచ్కూడా గెలిస్తేనే ఇండియా కు సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంటాయి అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాతో జరిగ బోయే 3వ టి20 మ్యాచ్ విశాఖపట్నం వేదికగా జరగబోతుంది. దీంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైంది రిషబ్ పంత్ సేనా. ఇప్పటికే 0-2 తేడాతో భారత్ వెనుకబడి ఉంది అన్న విషయం తెలిసిందే. దీంతో  మూడో టి20 మ్యాచ్ లో జట్టులో మూడు మార్పులు చేసుకునే అవకాశం ఉంది. తొలి రెండు మ్యాచ్లలో బౌలర్లు ఎంత ఘోరంగా విఫలం అయ్యారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే అంచనాలకు తగ్గట్లుగా రాణించలేక పోయిన అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడాకి తుది జట్టులో అవకాశం లభించనుంది.



 అదే సమయంలో వికెట్లు పడగొట్టకుండా భారీగా పరుగులు సమర్పించుకున్న స్పెషలిస్ట్ స్పిన్నర్ చాహల్ ను కూడా టి20 మ్యాచ్ లో పక్కన పెట్టే అవకాశం ఉంది అని తెలుస్తుంది. అతని స్థానంలో యువ ఆటగాడు రవి బిష్ణయ్ కి ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. మూడవ టీ20 మ్యాచ్ కి అటు ఆవేశ్ ఖాన్  సైతం బెంచ్ పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అతని స్థానంలో హార్ధదీప్ ఆడించాలని మేనేజ్మెంట్ భావిస్తోందట. అదే సమయంలో ఉమ్రాన్ మాలిక్ ను మరోసారి బెంచ్ కే పరిమితం చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇక ఈ మార్పులు చేర్పులతో ఇండియా ఎలా రాణిస్తుంది అనేది ఆసక్తికరం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: