నేడే మూడో టీ20.. తప్పక గెలవాల్సిందే?
అయితే 5 టీ 20 మ్యాచ్ ల సిరీస్లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ లలో విజయం సాధించినా సౌత్ ఆఫ్రికా ఇక ఇప్పుడు మూడవ టీ20 మ్యాచ్ లో కూడా విజయం సాధించి.. మరో రెండు మ్యాచ్లు మిగిలి వుండగానే నాకు సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అదే సమయంలో గత రెండు మ్యాచ్ లలో పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచిన టీమ్ ఇండియా జట్టు నేడు జరగబోయే మూడో టి20 మ్యాచ్ లో సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి.
ఈ క్రమం లోనే తొలి రెండు మ్యాచ్ లలో బౌలింగ్ బ్యాటింగ్ లో కూడా పూర్తిగా విఫలమైన టీమిండియా ఎన్నో మార్పులతో బరి లోకి దిగే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఒకవేళ టీమిండియా మూడో టి20 మ్యాచ్ ఓడి పోయింది అంటే అటు రిషబ్ పంత్ కెప్టెన్సీపై ఏ రేంజిలో విమర్శలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే చావో రేవో తేల్చుకోవాల్సిన మూడో టి20 మ్యాచ్ లో రిషబ్ పంత్ తన కెప్టెన్సీ తో ఎలాంటి మాయ చేయబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది.. ఇక ఏం జరుగుతుందో అని అది భారత క్రికెట్ ప్రేక్షకులు కూడా ఉత్కంఠగా మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు.