బాబర్ అజాం మరో రికార్డు.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు?
ఫార్మాట్ తో సంబంధం లేకుండా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అందర్నీ ఆకట్టు కుంటున్నాడు. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా మెరుగైన ప్రదర్శన తో ఎన్నో రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఎంతోమంది దిగ్గజాలు సాధించిన రికార్డులను అతి తక్కువ సమయం లో బ్రేక్ చేస్తూ తన పేరును లిఖించుకున్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన బాబర్ అజాం ఇంకా రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు అని చెప్పాలి. ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో రెండు సార్లు హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.
ఇక ఇప్పుడు ఇలాంటిదే మరో అరుదైన రికార్డు తన ఖాతా లో వేసుకున్నాడు అని చెప్పాలి. వరుసగా తొమ్మిది ఇన్నింగ్స్ లలో 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ గా ఘనత సాధించాడు. ఇక ఈ జాబితా లో జావేద్ మియాందాద్ 8 సార్లు ఇలా 50 కంటే ఎక్కువ పరుగులు చేయగా.. ఎడ్ వీక్స్ ఏడుసార్లు, రాహుల్ ద్రవిడ్ ఏడుసార్లు, కుమార సంగక్కర ఏడుసార్లు, మిస్బా ఉల్ హక్ 7, మోజస్ 7, విలియమ్సన్ ఏడు సార్లు వరుసగా 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు..