అదరగొట్టేశాడు.. 3 ఓవర్లు, 7 పరుగులు.. 5 వికెట్లు?

praveen
టి20 క్రికెట్ లో అటు బౌలర్లు ఎంత అద్భుతంగా బౌలింగ్ చేయాలని భావించినప్పటికీ తరచుగా దెబ్బ తింటూనే  ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే సిక్సర్లు ఫోర్లు కొట్టాలనే మైండ్ సెట్ బరిలోకి దిగే బ్యాట్స్ మెన్లు ప్రతి బంతిని బౌండరీకి తరలించెందుకే ప్రయత్నిస్తూ ఉంటారు. దీంతో బౌలర్లకు టీ20 క్రికెట్ అనేది పెద్ద సవాల్ లాంటిది అని చెప్పాలి. కానీ ఇక టి20 క్రికెట్ లో బౌలర్లు కాస్తా క్లిక్ అయ్యారు అంటే ఊహించని రేంజిలో పాపులారిటీ వస్తూ ఉంటుంది. కానీ టి20 ఫార్మాట్లో మాత్రం ఎక్కువ వికెట్లు పడగొట్టడం ఎంతో పొదుపుగా పరుగులు ఇవ్వకుండా బౌలింగ్ చేయడం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది.



 ఇక ఇటీవలే మొహాలీలో జరిగిన టీ-20 మ్యాచ్లో కూడా ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి.  ఎడమచేతి వాటం స్పీన్నర్  స్మిత్ పటేల్ ఒక వైపు వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టును బలహీనపరచడమే కాదు తక్కువ పరుగులు మాత్రమే చేస్తూ తన ప్రదర్శనతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. మొహాలీలోనూ యూనివర్సిటీల మధ్య టీ20 టోర్నీ జరుగుతుంది. ఈ క్రమంలోనే రెడ్బుల్ క్యాంపస్ క్రికెట్ పురుషుల జాతీయ టోర్నమెంట్లో ఇక వివిధ ప్రాంతాల నుంచి విశ్వవిద్యాలయాలు కళాశాలలు జట్లు పాల్గొంటూ ఉండటం గమనార్హం. ఇక ఈ టోర్నమెంట్లో భాగంగా ఇటీవలే జూన్ పదవ తేదీన సెమి ఫైనల్ మ్యాచ్లు జరిగాయి.



 ఇందులో గుజరాత్కు చెందిన  ఎల్జే కాలేజ్ రెండవ సెమీఫైనల్లో ఇండోర్లోని దేవి అహల్యాబాయి విశ్వవిద్యాలయంతో తలపడటం గమనార్హం. ఈ క్రమంలోనే ఎల్జే కాలేజ్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న స్పిన్నర్ స్మిత్ పాటిల్ అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థిలను దెబ్బ కొట్టాడు. 9 ఓవర్లలో 52 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది ప్రత్యర్థి జట్టు. కేవలం 14 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఇక చివరికి 120 పరుగులు మాత్రమే పరిమితమైంది అని చెప్పాలి. మూడు ఓవర్లు వేసి 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు స్మిత్ పాటిల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: