హార్దిక్ ఏంటిది.. దినేష్ కార్తీక్ విషయంలో అలా చేసావ్?
కానీ ఇటీవల ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియమ్ వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన తొలి టీ-20 మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ప్రదర్శన బాగున్నప్పటికీ ప్రవర్తన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చివర్లో వచ్చి 12 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో 31 పరుగులు చేసి అదరగొట్టాడు హార్దిక్ పాండ్యా.చివరి ఓవర్లో తొలి బంతికే పంత్ అవుటయ్యాడు. దినేష్ కార్తీక్ క్రీజులోకి వచ్చాడు.
మొదటి బంతి ఎదుర్కొన్న దినేష్ కార్తీక్ ఒక్క రన్ కూడా చేయలేదు. ఇక రెండవది ఒక సింగిల్ తీశాడు. ఇక నాలుగో నాలుగో బంతి హార్దిక్ పాండ్యా సిక్సర్ కొట్టగా.. ఐదో బంతిని యార్కర్ ఎదుర్కొన్నాడు. ఆ బంతికి సింగిల్ వచ్చే అవకాశమున్నా అవతల వైపు ఉన్నది బ్యాట్స్మెన్ కాదు బౌలర్ అన్నట్లుగా స్ట్రైక్ తనవైపే ఉంచుకున్నాడు. ఇలా దినేష్ కార్తీక్ లాంటి సీనియర్ కి స్ట్రైక్ ఇవ్వకపోవడంపై హార్దిక్ పాండ్యా పై విమర్శలు వస్తున్నాయి. అవతలి వైపు ఉంది పదో నెంబర్ బ్యాట్స్మెన్ అన్నట్లుగా దినేష్ కార్తీక్ విషయంలో హార్దిక్ పాండ్యా వ్యవహరించడం సరిగ్గా లేదు అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.