డాన్సర్ కావాల్సిన మిథాలీ.. క్రికెటర్ అయిందట తెలుసా?
ఏకంగా రెండు దశాబ్దాలకు పైగా భారత క్రికెట్ కు సేవలందించి భారత క్రికెట్ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇటీవలే వన్డే ఫార్మాట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు మిథాలీ రాజ్ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇక మిథాలీ రాజ్ తప్పుకోవడంతో ప్రస్తుతం వన్డే క్రికెట్ ఫార్మాట్ కెప్టెన్గా హర్మన్ ప్రీత్ కౌర్ ను ఎంపిక చేశారు బిసిసిఐ అధికారులు. అయితే మిథాలీ రాజ్ గురించి అటు ప్రేక్షకులందరూ ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
ప్రస్తుతం భారత క్రికెట్ లో లెజెండరీ క్రికెటర్ గా మారిపోయిన మిథాలీ రాజ్ డాన్సర్ కావాల్సింది క్రికెటర్ అయిందట. చిన్నప్పటి నుంచి మిథాలీరాజ్ కు భరతనాట్యం అంటే ఎంతో ఇష్టమట. ఈ క్రమంలోనే చిన్నప్పుడు నుంచి అటువైపు అడుగులు వేసి ఎనిమిదేళ్లపాటు ఇక భరతనాట్యం నేర్చుకుందట. ఎన్నో స్టేజ్ పర్ఫామెన్స్ లు కూడా ఇచ్చి అవార్డు కూడా గెలుచుకున్నారట. కానీ చిన్నప్పుడు ఉదయం లేటుగా నిద్రలేస్తూ ఉండడంతో ఇక మిథాలీ రాజ్ తండ్రి ఆమెను సికింద్రాబాద్ లోని ఒక స్పోర్ట్స్ అకాడమీలో చేర్పించడం తో ఇక మిథాలీ రాజ్ జీవితం మొత్తం మారిపోయింది. అప్పటి నుంచి క్రికెట్ పై మక్కువ పెరిగింది. అయితే ఇప్పటికి కూడా ఖాళీ సమయం దొరికితే మిథాలీరాజ్ భరతనాట్యం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుందట..