బాబర్ అజాంను ఊరిస్తున్న అరుదైన రికార్డు.. 202 పరుగులు చేస్తే?

praveen
ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు కెప్టెన్గా కొనసాగుతున్న బాబర్ అజాం తన అద్భుతమైన ప్రదర్శన తో రికార్డుల వేట కొనసాగిస్తాడు అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ప్రపంచ  క్రికెట్ లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రమే రికార్డుల రారాజుగా కొనసాగే వాడు. కానీ ఇప్పుడు మాత్రం బాబర్ ఆజమ్ ప్రతి మ్యాచ్లో కూడా మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ కోహ్లీ రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ ఉన్నాడు. ఇలా ప్రపంచ క్రికెట్ లో ఎంతోమంది దిగ్గజాలు పేరిట లిఖించబడిన రికార్డులను చెరిపేస్తూ తన పేరును రాసుకుంటున్నాడు బాబర్ అజాం.


 అంతేకాదు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో కూడా అత్యుత్తమ ఆటగాడిగా నెంబర్వన్ స్థానంలో కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన బాబర్ అజాం ఇప్పుడు మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమయ్యాడు. గతంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అయిన ఇంజమామ్ ఉల్ హక్ అంతర్జాతీయ క్రికెట్ లో 20 వేల పరుగులు సాధించి ఎలైట్ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం ఇలాంటి మరో అరుదైన రికార్డును సాధించేందుకు సిద్ధమయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్న 11వ బ్యాటర్ గా రికార్డుల్లోకి ఎక్కేందుకు  సిద్ధమవుతున్నాడు బాబర్ అజాం. వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో 202 పరుగులు చేస్తే ఈ ఘనత సాధించాడు.



 ఇప్పుడు వరకు 200 మ్యాచ్ లు ఆడిన ఈ 27ఏళ్ల క్రికెటర్ 9798 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు 67 అర్థసెంచరీలు ఉండడం గమనార్హం. అయితే పాకిస్తాన్ క్రికెట్ లో పాకిస్థాన్ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఇంజిమాముల్ హక్, యూనిస్ ఖాన్, మహమ్మద్ యూసుఫ్, జావెద్ మియాందాద్, సలీం మాలిక్, సయీద్ అన్వర్, మొహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, షాహిద్ అఫ్రిది, మిస్బావుల్ హక్ లాంటి క్రికెటర్లు పాకిస్తాన్  తరపున 10 వేల పరుగులు సాధించారు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం కూడా వీరి సరసన చేరేందుకు సిద్ధమవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: