టీమ్ ఇండియా తొలి టి20 మ్యాచ్.. ఆ ఇద్దరికీ నో ఛాన్స్?

praveen
భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా జట్టుతో టీమిండియా మరికొన్ని రోజుల్లో 5 మ్యాచ్ ల టి 20 సిరీస్ ఆడేందుకు సిద్దం అవుతుంది. అయితే జూన్ 9వ తేదీన మొదటి టి20 మ్యాచ్ ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగబోతుంది. ఈ క్రమంలోనే  ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్ లో మునిగితేలుతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. అయితే సీనియర్లు అయిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ బుమ్రా లకు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో వైస్ కెప్టెన్ గా ఉన్న కె.ఎల్.రాహుల్ ప్రస్తుతం టీమిండియా తాత్కాలికంగా సారథ్య  బాధ్యతలను చేపట్టాడు. ఈ క్రమంలోనే అతని కెప్టెన్సీలో టీమిండియాతో ఎలా రాణించ బోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.


 ఎందుకంటే ఈ ఏడాది జనవరి నెలలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీం ఇండియా జట్టు కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీలో వన్డే టి20 సిరీస్ ఓడిపోయింది. మరి ఇప్పుడు సొంత గడ్డపై అదే కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఎలా రాణిస్తుంది  అన్నదానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఢిల్లీ వేదికగా జరగబోయే మొదటి మ్యాచ్ పై స్పందించిన  టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి తన బెస్ట్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో నిరాశపరిచిన ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ కు తన తుది జట్టులో చోటు కల్పించలేదు రవిశాస్త్రి. అయితే ఇది కామన్ అన్న విషయం తెలిసిందే. కానీ ఐపీఎల్లో భీకర రీతిలో ప్రదర్శన చేసినా దినేష్ కార్తిక్ కి కూడా చోటు దక్కకపోవడం గమనార్హం.


రవిశాస్త్రి ప్రకటించిన  ప్లేయింగ్-XI:

కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్‌ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్/ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో కెప్టెన్గా ఆల్రౌండర్గా మంచి ప్రదర్శన కనబరిచిన హార్దిక్ పాండ్యా ను తన ప్లేయింగ్ ఎలెవెన్ జట్టులో కీలక ఆటగాడిగా అభివర్ణించాడు రవిశాస్త్రి. ఏది ఏమైనా రవిశాస్త్రి ప్రకటించిన ప్లేయింగ్ ఎలెవన్ జట్టు లో దినేష్ కార్తీక్ కు చోటు దక్కకపోవడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: