లసిత్ మలింగాకు ప్రమోషన్.. మరోసారి?

praveen
లసిత్ మలింగ.. ఒకప్పుడు ఈ పేరు చెబితే చాలు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మన్ లుగా ఉన్నవారికి సైతం హడల్ పుడుతూ  ఉండేది. ఎందుకంటే అతని బౌలింగ్ అలా ఉండేది.  పదునైన యార్కర్లు సంధించడంలో అతను దిట్ట అనే చెప్పాలి. ఇక ఒత్తిడిలో కూడా మెరుగైన ప్రదర్శన కనపరిచటంలో లసిత్ మలింగ తర్వాతే ఇంకెవరైనా అని చెప్పాలి. ఒక జట్టు తరఫున ఎన్నో ఏళ్ల పాటు ప్రాతినిథ్యం వహించిన లసిత్ మలింగ అటు ఐపీఎల్ ద్వారా కూడా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు అన్న విషయం తెలిసిందే.  ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడుతూ ముంబై ఇండియన్స్ కప్పు గెలవడంలో ఎంతో కీలకపాత్ర వహించాడు.



 ఇక ప్రపంచ క్రికెట్లో ఎంతో మంది బౌలర్లు ఉన్న లసిత్ మలింగ బౌలింగ్ శైలి మాత్రం కాస్త ప్రత్యేకం అని చెప్పాలి. ప్రత్యేకమైన బౌలింగ్ శైలి తో అటు బ్యాట్స్మెన్లను తికమక పెడుతూ ఎప్పుడూ కీలక సమయంలో వికెట్లు పడగోడుతూ ఉండేవాడు లసిత్ మలింగ. ఇక అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ఐపీఎల్లో ఇటీవలే కోచ్గా బాధ్యతలు చేపట్టాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు శ్రీలంక క్రికెట్ లో లసిత్ మలింగ ప్రమోషన్ వచ్చింది అన్నది తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో శ్రీలంక జట్టు స్వదేశం వేదికగా ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది.


 ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టు ఎదుర్కొనేందుకు శ్రీలంక పదునైన వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే దిగ్గజ పేసర్ లసిత్ మలింగ ను శ్రీలంక బౌలింగ్ స్ట్రాటజీక్ కోచ్ గా నియమించింది శ్రీలంక క్రికెట్ బోర్డు. ఈ ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా గడ్డపై శ్రీలంక పర్యటించిన సమయంలో  ఈ పాత్ర పోషించాడు లసిత్ మలింగ. ఇక ఆస్ట్రేలియా సిరీస్ లంక బౌలర్లకు మైదానంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంతో విలువైన సలహాలు సూచనలు ఇచ్చి మెరుగైన ప్రదర్శన చేయడంలో కీలకపాత్ర వహించాడు. ఇక ఇప్పుడు అనుభవజ్ఞుడైన లసిత్ మలింగ సూచనలు శ్రీలంక బౌలర్ల కు ఎంతో ఉపయోగపడతాయని నమ్ముతున్నాము అంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: