ఫాస్టెస్ట్ డెలివరీ.. ఉమ్రాన్ మాలిక్ రికార్డ్ బ్రేక్?
అంతేకాదు ఉమ్రాన్ మాలిక్ బుల్లెట్ లాంటి భద్రుని విసురుతూ కీలక సమయంలో వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే మొన్నటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత ఫాస్ట్ డెలివరీ అటు ఉమ్రాన్ మాలిక్ పేరిటే ఉంది. ఏకంగా 157 కిలోమీటర్ల వేగంతో ఉమ్రాన్ మాలిక్ బంతిని విసిరి సరికొత్త చరిత్ర సృష్టించాడు అనే చెప్పాలి. అయితే ఇక ఇలా 157 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరిన ఉమ్రాన్ మాలిక్ రికార్డును బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం అని అందరూ అనుకున్నారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు ఇక్కడ ఒక ఆటగాడు.
ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెర్గుసన్ ఏకంగా 157.3 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతూ ఉమ్రాన్ మాలిక్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డును బ్రేక్ చేసి తన పేరును లిఖించుకున్నాడు. ఇటీవల ఐపీఎల్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇక ఈ ఫీట్ సాధించాడు ఫెర్గుసన్.. అయినప్పటికీ అటు ఈ సీజన్లో సన్రైజర్స్ తరఫున ఆడిన అన్ని మ్యాచ్ లలో కూడా ఫాస్టేస్ట్ డెలివరీ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఉమ్రాన్ మాలిక్ అందుకోవడం గమనార్హం. ఉమ్రాన్ మాలిక్ తన స్పీడ్ బౌలింగ్ తో సెలెక్టర్లను ఆకర్షించి అటు దక్షిణాఫ్రికాతో ఆడబోయే జట్టులో చోటు దక్కించుకున్నాడు అనే విషయం తెలిసిందే..