బిల్డప్ బాబాయ్ లా మారిన బంగ్లాదేశ్ క్రికెటర్.. ఏం చేసాడో తెలుసా?

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డులు సాధించిన ఆటగాళ్లు తాము ఎంతో గొప్ప ఆటగాళ్లమన్ని ఫీల్ కాకుండా క్రికెట్ లో నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది అన్నట్లుగా అనుకువ గా  ఉంటారు  కానీ కొంతమంది క్రికెటర్లు మాత్రం ఒక రికార్డు సాధిస్తే చాలు ఇక తమకంటే తోపు ఎవ్వరు ఉండరు అని భావిస్తూ ఉంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెటర్ పరిస్థితి అలాగే మారిపోయింది అన్నది తెలుస్తుంది. ఏకంగా టెస్ట్ క్రికెట్ లో ఐదు వేల పరుగులు పూర్తి చేసుకున్న బంగ్లాదేశ్ క్రికెటర్ బిల్డప్ బాబాయ్ అవతారమెత్తాడు.

 క్రికెట్ లో ఆల్ టైమ్ దిగ్గజం తోనే తనను తాను పోల్చుకుంటూ  అభిమానులందరికీ షాకిచ్చాడు. క్రికెట్లో పసికూన గా ఉన్న బంగ్లాదేశ్ కొన్ని సంవత్సరాల్లోనే ఊహించని రేంజ్ లో గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం ఎంతో పటిష్టంగా మారి పెద్ద జట్లకు సైతం షాక్ ఇచ్చే స్థాయికి ఎదిగింది. బంగ్లాదేశ్ జట్టు వికెట్ కీపర్ గా కొనసాగుతున్నా ముష్ఫికర్ రహీం ఇటీవలే శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు సందర్భంగా ఒక అరుదైన ఘనత సాధించాడు. తొలి టెస్టు ఇన్నింగ్స్ లో 105 చేసి సెంచరీతో అదరగొట్టాడు.

కాగా టెస్ట్ ఫార్మాట్లో ఐదు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి బంగ్లాదేశ్ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. దీంతో బిల్డప్ బాబాయి అవతారమెత్తాడు. సాధారణంగా ప్రపంచ క్రికెట్లో సర్ బ్రాడ్ మన్ ను క్రికెట్ మెజీషియన్ అంటూ అందరూ కీర్తిస్తూ ఉంటారు. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా లాంటి దిగ్గజాలూ సైతం బ్రాడ్ మన్  తో మమ్మల్ని పోల్చవద్దు అంటూ తమ గొప్పతనాన్ని చాటుకున్నారు. కానీ ఇటీవల బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం మాత్రం ఐదు వేల పరుగులు పూర్తి చేసుకున్నందుకు ఎంతో గర్వంగా ఉందని.. ఈ రికార్డును చాలా మంది సీనియర్లు బద్దలు కొడతారూ అని చెప్పుకొచ్చాడు. నేను బ్యాటింగ్ చేస్తుంటే బంగ్లాదేశ్ ప్రేక్షకులకు బ్రాడ్ మన్ లాగా  కనిపిస్తాను. నన్ను అలా అంటుంటే ఎంతో గర్వంగా ఉంది అంటూ ఏకంగా బ్రాడ్ మన్  తో తనను పోల్చుకోవడం తో అందరూ ఆశ్చర్యపోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: