క్రికెట్ ఎప్పుడు, ఎక్కడ మొదలైందో తెలుసా?

praveen
క్రికెట్ ఆటకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆటకి ఉన్న గుర్తింపు ఒక ఎత్తయితే.. అటు ఇండియాలో ఉన్న గుర్తింపు ఆదరణ మరో ఎత్తు అని చెప్పాలి. ఎందుకంటే ఇండియాలో జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ భారతదేశంలో దాదాపు సగం మందికి పైగా ఇష్టపడేది మాత్రం అటు క్రికెట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారత్లో క్రికెట్ అనేది ఒక ఆట కాదు అది ఒక మతం అన్నట్లుగా మారిపోయింది నేటి రోజుల్లో క్రికెట్ మ్యాచ్ వస్తుందంటే చాలు టీవీలకు అతుక్కుపోయి ఎంతో ఆతృతగా మ్యాచ్ వీక్షించడానికి అందరూ ఎంతో ఆసక్తి చూపుతుంటారు.



 ఇక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేక్షకులు ఎక్కడ మ్యాచ్ జరిగినా ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియం కు తరలి వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు అన్న విషయం తెలిసిందే. కేవలం క్రికెట్ చూడటం మాత్రమే కాదు సరదాగా తమ దగ్గరలో ఉన్న మైదానంలో క్రికెట్ ఆడటం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. కాస్త సమయం దొరికిందంటే చాలు బ్యాట్ బాల్ పట్టుకుని మైదానంలోకి పరుగులు పెడుతూ ఉంటారు యూత్. ఇంకొంతమంది ఎంత బిజీగా ఉన్నా మ్యాచ్ స్కోర్ ఎంత అని ఐదు నిమిషాలకు ఒకసారి చూస్తూ ఉంటారు ఇలా క్రికెట్ గురించి చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి.


 ఇలా క్రికెట్ ని ప్రతి ఒక్కరు పిచ్చి గా అభిమానిస్తూ ఉంటారు. ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలుసు. కానీ క్రికెట్ మూలాలు ఎక్కడ ఉన్నాయి అసలు మొదట క్రికెట్ కనిపెట్టింది ఎవరు అనేది మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. సరిగ్గా ఆరు వందల సంవత్సరాల పూర్వమే క్రికెట్ ఆట ప్రారంభం అయిందట. మొదటి క్రికెట్ మ్యాచ్ లండన్, కెంట్ జట్ల మధ్య జరిగిందట. 1744 జూన్ 18వ తేదీన మొదటి క్రికెట్ మ్యాచ్ జరిగిందట. ప్రస్తుతం ఉన్నట్లుగా అప్పట్లో నియమ నిబంధనలు ఉండేవి కావట. అంతేకాదు క్రికెట్ బ్యాట్ కూడా హాకీ బ్యాట్ ఆకారంలో ఉండేదట. ఇక రెండు వికెట్ లతోనే వికెట్లు ఉండేవట. అప్పుడు మొదలైన క్రికెట్లో ఇప్పటికీ ఎన్నో అనూహ్యమైన మార్పులు వచ్చి ఇక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ పూర్తిగా విస్తరించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: