మమ్మల్ని రిటైర్మెంట్ ప్రకటించమంటావా : షాహీన్ అఫ్రిది

praveen
అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతంగా రాణించిన బ్యాట్స్మెన్లు అప్పుడప్పుడూ తమలో ఉన్న సరికొత్త టాలెంట్ బయటపెడుతూ అభిమానులు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ఎప్పుడు అద్భుతమైన బ్యాటింగ్తో పరుగుల వరద పారించే బ్యాట్స్మెన్లు  కొన్ని కొన్ని సార్లు బౌలింగ్ కూడా చేయడం లాంటివి చూస్తూ ఉంటారూ. గతంలో భారత క్రికెట్లో సిక్సర్ల వీరుడిగా పేరు సంపాదించుకున్న యువరాజ్ సింగ్ ఎన్నో సార్లు బౌలింగ్ చేశాడు. ఇక హ్యాట్రిక్ వికెట్ లు కూడా పడగొట్టి సత్తా చాటాడు. ఇలా బాటిల్లో అదరగొట్టడమే కాదు బౌలింగ్ ప్రతిభను కూడా నిరూపించుకుని అభిమానులు అందరితో వావ్ అంటూ అనిపించుకున్నాడు యువరాజ్ సింగ్.



 కేవలం యువరాజ్ సింగ్ మాత్రమే కాదు వికెట్లు వెనకాల ఉండి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సూపర్ ఫినిషర్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సైతం పలుమార్లు స్పిన్ బౌలింగ్ వేసిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో వికెట్ కీపర్ కూడా ఇలాంటిదే చేసి అందరిని ఆశ్చర్య పరిచాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో కౌంటీలు జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ కౌంటీల్లో అటు  అన్ని దేశాల నుంచి కూడా క్రికెట్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ మహమ్మద్ రిజ్వాన్ కూడా ఈ కౌంటీల్లో పాల్గొంటూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.


 ఇన్నాళ్ళ వరకు కీపింగ్ తో ఆకట్టుకోవడం.. ఇక బ్యాటింగ్తో సెన్సేషన్ సృష్టించడం లాంటివి చేసిన మహమ్మద్ రిజ్వాన్ ఇక ఇటీవల ఏకంగా బౌలింగ్ కూడా చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక దీనిపై పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రిజ్జి భాయ్ ఏం చేస్తున్నావ్. కనీసం బౌలింగ్ అయినా మా కోసం వదిలేయ్.. మమ్మల్ని రిటైర్మెంట్ ప్రకటించమంటావా అంటూ సరదాగా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. కాగా ససెక్స్ వర్సెస్ డార్హం మ్యాచ్లో రిజ్వాన్ రెండు ఓవర్లు వేసి ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు.  కాగా భారత ఆటగాడు చటేశ్వర్ పుజారా కూడా ఇదే జట్టుకు ఆడుతూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: