కోహ్లీ బుర్రలో ఏముందో అర్థం కావట్లేదు : గంగూలీ
ఇక బౌలర్లపై కనీస జాలి దయ చూపించకుండా విరుచుకుపడిన అద్భుతమైన ఇన్నింగ్స్ కూడా చూశాము. కానీ అలాంటి విరాట్ కోహ్లీ ఇప్పుడు మాత్రం పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. ఒకప్పుడు అలవోకగా సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ ఇప్పుడు బ్యాటింగ్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతూ అనవసర షాట్స్ ఆడి వికెట్ చేజార్చుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలా రోజు రోజుకి విరాట్ కోహ్లీ పేలవమైన పాము కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు అన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ పుంజుకుంటాడు అని అందరూ ధీమా వ్యక్తం చేయడం తప్ప కోహ్లీ మాత్రం రోజు రోజుకు మరింత పేలవ ప్రదర్శన చేస్తూ ఉన్నాడూ.
అయితే ఇప్పటికే విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ పై ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సైతం స్పందించాడు. విరాట్ కోహ్లీ బుర్ర లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. కానీ అతను మళ్ళీ పుంజుకొని మునుపటి ఫామ్ అందుకొని భారీగా పరుగులు సాధిస్తాడు. అతను ఒక గొప్ప ప్లేయర్ అంటూ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇకపోతే గతంలో కెప్టెన్సీ మార్పు విషయంలో సౌరవ్ గంగూలీ విరాట్ కోహ్లి మధ్య విభేదాలు తలెత్తి తారస్థాయికి చేరుకున్నాయి అన్న విషయం తెలిసిందే..