స్టేడియంలో మిస్టరీ గర్ల్.. ఆమె ఎవరో తెలిస్తే షాకే?
2018 ఐపీఎల్ సీజన్ లో కావ్య మారన్ దగ్గర నుంచీ ఇక ఈ మిస్టరీ గర్ల్ ట్యాగ్ ప్రతియేటా ఆనవాయితీగా కొనసాగుతూనే వస్తోంది ఇకపోతే ఇటీవలే కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ కాపిటల్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియం లో ఒక మిస్టరీ గర్ల్ తళుక్కున మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఇక ఆమె ఫోటో కాస్త వైరల్ గా మారి పోవడంతో ఆమె ఎవరు అని సోషల్ మీడియాలో నెటిజన్లు వెదకడం ప్రారంభించారు. ఇక అసలు విషయం తెలిసి అందరూ అవాక్కయ్యారు అని చెప్పాలి.
ఎందుకంటే ఇలా ఇటీవలే మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియం లో కనిపించిన మిస్టరీ గర్ల్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఆ అమ్మాయి పేరు ఇషా నెగె. ఇక ఆమె ఎవరో కాదు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ గర్ల్ ఫ్రెండ్. ఇద్దరు కూడా గత ఐదేళ్ల నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు అనే విషయం తెలిసిందే. రిషబ్ పంత్ ఇషా నెగె తో చనువుగా దిగిన ఒక ఫోటో పోస్ట్ చేస్తూ నిన్ను ఎప్పుడూ హ్యాపీ గా చూడటానికి ప్రయత్నిస్తున్న నువ్వే నా ప్రాణం అంటూ పోస్ట్ పెట్టాడు. అయితే ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్లో కూడా స్టేడియం లోకి రాని ఇషా నెగె కోల్కతా నైట్రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో మాత్రం తళుక్కుమని మెరిసింది. కానీ ఏం లాభం రిషబ్ పంత్ తన గర్ల్ ఫ్రెండ్ ముందు బ్యాటింగ్ లో పెద్దగా రాణించలేకపోయాడు.