కోహ్లీ.. ఐపీఎల్ నుంచి తప్పుకో : రవి శాస్త్రి
వరల్డ్ క్లాస్ ప్లేయర్ గా గుర్తింపు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఆడినా తొమ్మిది మ్యాచ్ లలో కేవలం 128 పరుగుల మాత్రమే చేసాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొదటిసారి ఐపీఎల్ లోకి అరంగేట్రం చేసిన ఆయుష్ బధోని లాంటి ఆటగాళ్లు 7 ఇన్నింగ్స్ లో 134 పరుగులు చేస్తే ఇక టాప్ క్లాస్ ప్లేయర్ కోహ్లీ ఆ మాత్రం స్కోర్ కూడా చేయకపోవడం గమనార్హం. కోహ్లీ పేలవమైన ఫాంపై టీమిండియా మాజీ కోచ్ కోహ్లీ సన్నిహితుడిగా పిలుచుకొనే రవిశాస్త్రి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ లో విఫలమవుతున్న విరాట్ కోహ్లీ వెంటనే ఐపీఎల్ నుంచి తప్పుకోవాలంటూ సూచనలు చేశాడు.
కోహ్లీ ఇంకా ఎన్నో రోజుల పాటు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలి అంటే మాత్రం ఇక ఐపీఎల్ నుంచి తప్పు కోవాలి అని నిర్ణయం తీసుకోవడం ఎంతో మంచిది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కేవలం విరాట్ కోహ్లీ కి మాత్రమే తన సలహా పరిమితం కాదని ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న అందరూ కూడా బ్రేక్ తీసుకొని కొన్నాళ్ళ పాటు రెస్ట్ తీసుకోవడం బెటర్ అంటూ చెప్పుకొచ్చాడు. గత కొన్నాళ్ల నుంచి అన్ని ఫార్మాట్లకు కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లీ నిర్విరామంగా క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. అతనికి కొంత సమయం పాటు బ్రేక్ అవసరం అంటూ రవిశాస్త్రి తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ రాణించాలనుకుంటే ఇక ఐపీఎల్ నుంచి తప్పుకోవడం ఉత్తమం అంటూ చెప్పుకొచ్చాడు..