నన్ను ఐపీఎల్ నుంచి వెళ్ళిపొమ్మన్నారు : హర్షల్ పటేల్
ఇక ఇందులో ఎక్కువ కాలంపాటు బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహించడం గమనార్హం. ఈ క్రమంలోనే గతంలో తనను టి20 లీగ్ మధ్యలో నుంచి ఇంటికి పంపించిన కొన్ని సందర్భాలను గుర్తు చేసుకున్నాడు. 2016 ఐపీఎల్ సీజన్ లో ఐదు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. 2017 లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. టోర్ని మధ్యలో నన్ను ఇంటికి కూడా పంపించారు. అయితే సాధారణంగా ఒక ఆటగాడిని తుది జట్టులోకి తీసుకోకుండా తమతో పాటే ఉంచుకుంటే హోటల్ రూమ్ రోజువారి అలవెన్సులు ఫ్లైట్ టికెట్ లు ఇలా యాజమాన్యం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ రోజు డానియెల్ వెట్టోరి నీతో మాట్లాడాలనుకుంటున్నాను అంటూ నన్ను కలిశారు. ఇక నాలుగైదు మ్యాచ్ ల కంటే ఎక్కువ ఆడించ లేక పోతున్నాం. అందుకే ఓ నిర్ణయానికి వచ్చాము. నిన్ను ఇంటికి పంపించాలని అనుకుంటున్నాము అంటూ డానియెల్ వెట్టోరి చెప్పారు అంటూ హర్షల్ పటేల్ గుర్తుచేసుకున్నాడు.
నన్ను తిరస్కరించి ఇంటికి పంపించడానికి ఇదే కారణం అని చెప్పారు. 2017 సీజన్లో బెంగళూరు ప్లే ఆఫ్ క్వాలిఫై కాలేదు. ఇంకా నాలుగైదు మ్యాచ్ లు ఉన్నాయి. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ డానియెల్ వెట్టోరికి ఒక మెసేజ్ చేశాను ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ లో అవకాశం వచ్చింది. 14 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు కూడా తీసుకున్నాను. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచా ఇక బెంగుళూరు విజయం సాధించిన తర్వాత ఢిల్లీ కొనుగోలు చేసింది. 2021లో మరోసారి బెంగళూరు తరఫున ఆడాను అంటూ హర్షల్ పటేల్ గుర్తుచేసుకున్నాడు. అయితే 2021 సీజన్లోనే బెంగుళూరు తరఫున 32 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు హర్షల్ పటేల్..