కోహ్లీపై ఆ నమ్మకం ఉంది : బంగర్

praveen
మొన్నటి వరకు టీమిండియాకు ఆడిన సమయంలో పేలవమైన ఫామ్ కొనసాగిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు విరాట్ కోహ్లీ. అయితే కెప్టెన్సీ ఒత్తిడి కారణంగానే సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు అంటూ విరాట్ కోహ్లీ 3 ఫార్మాట్లకు కెప్టెన్సీకి  కూడా గుడ్ బాయ్ చెప్పేసాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బ్యాటింగ్లో ఇక విరాట్ కోహ్లీ చెలరేగి ఆడటంతో ఖాయమని అభిమానులు అందరూ భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. కానీ అభిమానుల అంచనాలు మాత్రం తారుమారు అవుతున్నాయ్ అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు ఐపీఎల్ లో కూడా అదేరీతిలో పేలవమైన ఫామ్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఒకప్పుడు భారీగా పరుగులు చేస్తూ స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించి రన్ మెషిన్ గా పేరు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు మాత్రం రెండంకెల స్కోరు చేయడానికి కూడా నానా తంటాలు పడుతున్న పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఇక అంతే కాకుండా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం చివరికి ఒక్క పరుగు కూడా చేయకుండా డకౌట్ గా పెవిలియన్ చేరడం చేస్తూ ఉన్నాడు. దీంతో విరాట్ కోహ్లీ అలిసిపోయాడని కొన్నాళ్ళ పాటు రెస్ట్ అవసరం అంటూ ఎంతోమంది మాజీ క్రికెటర్లు విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 ఇకపోతే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పై ఇటీవలే బెంగళూరు జట్టు హెడ్ కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ మునుపటి ఫామ్ ను అందుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ  ఈ సందర్బంగా చెప్పుకొచ్చాడు. ఇక త్వరలోనే అతడు పుంజుకుని మల్లి మునుపటి ఫాంలోకి వస్తాడని నమ్మకం ఉంది అంటూ తెలిపాడు. ఇక ప్రతి ఆటగాడి కెరియర్లో ఇలాంటి చేదు అనుభవాలు మామూలే అంటూ తెలిపాడు. కాగా ఇప్పుడు వరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడిన విరాట్ కోహ్లీ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు అనే విషయం తెలిసింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: