సాహ దెబ్బకు.. స్పోర్ట్స్ జర్నలిస్ట్ కి ఊహించని షాక్?

praveen
టీమిండియా క్రికెటర్ వృద్ధిమాన్ సాహా సోషల్ మీడియా వేదికగా బయటపెట్టిన ఒక విషయం సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయినా నువ్వు నాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే అస్సలు బాగుండదు అంటూ ఒక జర్నలిస్టు బెదిరింపులకు పాల్పడ్డాడు అంటూ సోషల్ మీడియాలో వెల్లడించాడు  సాహ. ఎన్నో స్క్రీన్ షాట్ లు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కానీ ఆ జర్నలిస్టు ఎవరు అన్న విషయాన్ని మాత్రం రివిల్ చేయలేదు. ఇక ఆ సమయంలో ఎంతో మంది మాజీ క్రికెటర్లు వృద్ధిమాన్ సాహా కు మద్దతుగా నిలిచారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇక ఈ విషయాన్ని ఎంతో సీరియస్గా తీసుకున్న బీసీసీఐ దీనిపై విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే వృద్ధిమాన్ సాహా విషయంలో బెదిరింపులకు పాల్పడింది జర్నలిస్ట్ బోరియా మజుందార్ అన్న విషయాన్ని గుర్తించారు. ఇదే విషయంపై విచారణ జరపగా ఆ జర్నలిస్టు దే తప్పు అని తేలడంతో అతనిపై చర్యలకు సిద్ధమైంది బీసీసీఐ. అతనిపై  రెండేళ్ల పాటు నిషేధం పడే అవకాశం కూడా ఉంది అని తెలుస్తుంది. ఈ రెండేళ్ల కాలంలో జర్నలిస్టు మజుందార్  టీమిండియా ఆటగాళ్లు కలవడం గాని.. స్వదేశంలో భారత్తో ఆడే మ్యాచ్ లకు వెళ్లడం కానీ  చేయకూడదని ఇక బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఒక ప్రకటనలో పేర్కొనడం గమనార్హం.


 వృద్ధిమాన్ సాహా చేసిన ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి నిజానిజాలను తేల్చేందుకు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా,ట్రెజరర్ అరుణ్ దుమాల్, అపెక్స్ కౌన్సిల్ మెంబర్ ప్రభూతేజ్  లతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది బిసిసీఐ.  కమిటీ ముందు హాజరైన సాహా జర్నలిస్టు  మజుందార్ తమ వెర్షన్ వెల్లడించారు. ఇంటర్వ్యూ  ఇవ్వనందుకు వేధింపులకు పాల్పడ్డాడని సాహా పేర్కొనగా మరోవైపు సాహ వాట్సాప్ చాటింగ్ తారుమారు చేసి స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని జర్నలిస్టు ఆరోపించాడు. ఇద్దరు ఆరోపణలు పరిగణలోకి తీసుకొని నిజాలను నిగ్గు తేల్చి చివరికి జర్నలిస్ట్ దే తప్పు అన్న విషయం తేల్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: