ధోనికో లెక్క.. పంత్ కి మరో లెక్క.. ఇదెక్కడి న్యాయం?

praveen
ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో తలెత్తిన నో బాల్ వివాదం అంతకంతకూ ముదురుతోంది అన్న విషయం తెలిసిందే.  నడుము కంటే పైకి బంతి వచ్చినప్పటికీ  అంపైర్ నో బాల్ ఇవ్వకపోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ పంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఏకంగా మైదానంలో ఉన్న తమ జట్టు ఆటగాళ్లను రీ కాల్ చేశాడు. అసిస్టెంట్ కోచ్ ను మైదానంలోకి పంపించి చర్చలు జరిపాడు. ఇక ఇదంతా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఈ క్రమంలోనే ఐపీఎల్ నిర్వాహకులు ఏకంగా పంత్ మ్యాచ్ ఫీజులో 100% జరిమానా విధించారు. ఇక పంత్ కి మద్దతుగా నిలిచిన శార్దూల్ ఠాకూర్ అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే ల పై కూడా కొరడా ఝుళిపించారు. దీంతో ఇక ఈ విషయం కాస్త మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. రిషబ్ పంత్ నో బాల్ వివాదం నేపథ్యంలో ఇక ఇప్పుడు గతంలో జరిగిన ఇలాంటి ఒక ఘటన తెరమీదికి వచ్చింది. 2019 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్  కొనసాగుతున్న ధోని నో బాల్ విషయంలో తన కూల్ నెస్ కోల్పోయి ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు  ఒక రకంగా చెప్పాలంటే పంత్ లాగానే కాస్తా అతి చేశాడు.


 చెన్నై సూపర్ కింగ్స్ గెలుపుకి మూడు బంతుల్లో 8 పరుగులు కావాల్సిన సమయంలో నడుము కంటే ఎక్కువ ఎత్తులో ఫుల్ టాస్ బంతిని సంధించగా ఫీల్డ్ అంపైర్ దానిని నో బాల్ గా ప్రకటించలేదు. కోపంతో ఊగిపోయిన ధోని ఏకంగా గ్రౌండ్ లోకి వెళ్లి రచ్చ రచ్చ చేశాడు. వాగ్వాదానికి దిగాడు. ధోని ఇలా చేసిన సమయంలో కేవలం మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత తో ఐపీఎల్ నిర్వాహకులు ఊరుకున్నారు.  ధోని విషయంలో ఇంత ఉదాసీనంగా వ్యవహరించిన ఐపీఎల్ నిర్వాహకులు పంత్  ఇష్యూ ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. 100% మ్యాచ్ ఫీజులో కోత మాత్రమే కాకుండా అంతర్గత సమావేశాల్లో ఈ విషయంపై పెద్ద చర్చ నడుస్తుందని టాక్. ధోనికో లెక్క పంత్ కో లెక్కనా ఇదెక్కడి న్యాయం అటు ఐపీఎల్ నిర్వాహకులను నిలదీస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: