ఐపీఎల్ : కేజిఎఫ్ సినిమా చూసిన బెంగళూరు ప్లేయర్లు?

praveen
సాధారణంగా సినిమాలకంటే ఎంటర్టైన్మెంట్ పంచేది ఇంకేమీ ఉండదు అని చెప్పాలి. ఎందుకంటే ఇక అందరికీ క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందించే ఆటగాళ్లు సైతం అటు సినిమాలను చూసి తెగ సంబరపడిపోతూ ఉంటారు. ఇక సాధారణ ప్రేక్షకులు లాగానే తమ అభిమాన హీరోల సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. అదే సమయంలో కొన్ని కొన్ని సార్లు ఇక ఆయా జట్ల యాజమాన్యాలు ఆటగాళ్లు  రిలాక్స్ అయ్యేందుకు కొన్ని రకాల సినిమాలను చూపించడం లాంటివి చేస్తూ ఉంటారు. తమ జట్టు ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపేందుకు కొన్ని సినిమాలను చూపించడం లాంటివి జరుగుతూ ఉంటుంది.

 ఇకపోతే ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది అనే విషయం తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతూ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎన్నడూ లేనంతగా పటిష్టంగా కనిపిస్తూ ఉంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. హోరాహోరీ గా పోరాడుతూ వరుస విజయాలతో దూసుకుపోతున్న బెంగుళూరు ఆటగాళ్లకు కాస్త రిలాక్సేషన్ ఇచ్చేందుకు ఇటీవలే జట్టు యాజమాన్యం ఒక ప్రత్యేక షో నిర్వహించారు. ప్రస్తుతం కన్నడ హీరో యాష్ నటించిన కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా థియేటర్లలో ఎంత హవా నడిపిస్తుంది  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 భారీ విజయాన్ని సాధించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. అయితే ఇక ఇదే సినిమాని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్వాహకులు జట్టు సభ్యుల రిలాక్స్ కోసం ప్రత్యేకమైన షో ఏర్పాటు చేశారు.  బయో బబుల్ లో ఉన్న ఆటగాళ్లు సిబ్బంది సినిమాలు చూసి తెగ ఎంజాయ్ చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాపై తమ స్పందన ఏమిటి అన్న విషయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు జట్టు యాజమాన్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kgf

సంబంధిత వార్తలు: