శ్రేయస్ అయ్యర్.. నన్ను పెళ్లి చేసుకుంటావా?
ఇప్పుడు ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. శ్రేయస్ అయ్యర్ అభిమాని ఒక వింత ప్లకార్డుతో స్టేడియం లో దర్శనమిచ్చింది.. మొన్నటి వరకు ఢిల్లీ జట్టులో కొనసాగిన శ్రేయస్ అయ్యర్ ఇక ఇప్పుడు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. క్రికెట్లో కూడా యువ ఆటగాళ్ల లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు కెప్టెన్గా కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారు శ్రేయస్ అయ్యర్. ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కాస్త ఎక్కువగానే ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇకపోతే శ్రేయస్ అయ్యర్ వీరాభిమాని అయిన ఒక యువతి ఇటీవలే శ్రేయస్ అయ్యర్ పై తనకున్న ప్రేమను అభిమానాన్ని ఫ్లకార్డ్ రూపంలో ప్రదర్శించింది. కుదిరితే ఏకంగా శ్రేయస్ అయ్యర్ ను పెళ్లి చేసుకోవడానికి రెడీ గా ఉన్నాను అంటూ తన మనసులో మాట బయట పెట్టింది. అబ్బాయిని వెతుక్కో అంటూ మా అమ్మ చెప్పింది.. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా శ్రేయాస్ అయ్యర్ అంటూ రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించి ఇక శ్రేయస్ అయ్యర్ కు పెళ్లి ప్రపోజల్ చేసింది. రాజస్థాన్ తో కోల్కతా నైట్రైడర్స్ మ్యాచ్ ఆడిన సమయంలో ఇది జరగడం గమనార్హం.