ఐపీఎల్ : షాకిచ్చిన కరోనా వైరస్.. మ్యాచ్ రద్దు అవుతుందా?

praveen
బిసిసిఐకి కరోనా వైరస్ వరుసగా షాక్ ఇస్తూనే ఉంది అనే విషయం తెలిసిందే. మూడేళ్ల నుంచి బీసీసీఐ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఐపీఎల్ విషయంలో ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తోంది కరోనా వైరస్.  అయితే ఐపీఎల్ నిర్వహణ కోసం బీసీసీఐ మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకున్నప్పటికీ కూడా కరోనా వైరస్ మాత్రం ఆ మాస్టర్ ప్లాన్ ను దెబ్బతీస్తోంది. అయితే గత రెండు రోజుల నుంచి భారత్ వేదికగా కాకుండా యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహించింది బిసిసిఐ.. అయితే ఈ ఏడాది కాస్త రిస్క్ అని తెలిసినప్పటికీ కూడా భారత్లో ఐపీఎల్ నిర్వహించడానికి సిద్ధమైంది. అదే సమయం లో కరోనా వైరస్ ప్రభావం కాస్త తక్కువగా ఉండటంతో స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది.


 అంతేకాదు ఎప్పటిలాగే ఆటగాళ్లందరిని బయో బబుల్ లో ఉంచుతూ క్వారంటైన్ కు పరిమితం చేసినప్పటికీ బిసిసిఐకి వరుసగా షాకులు మాత్రం తప్పడం లేదు అన్నది తెలుస్తుంది.  గత కొన్ని రోజుల నుంచి ఐపీఎల్  బయో బబుల్ లో వరుసగా కరోనా వైరస్ కేసులు వెలుగు లోకి వస్తూ ఉండటం సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కూడా కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ టీం మెంబెర్స్ కరోనా వైరస్ బారిన పడిన వేళ ఇక బుధవారం పంజాబ్ కింగ్స్  లో జరగాల్సిన మ్యాచ్ పై ప్రస్తుతం సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


 ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు మిచెల్ మార్ష్ ఫిజియో పాట్రిక్ ను ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే బిసిసిఐ ఆదేశాల మేరకు అటు ఢిల్లీ కాపిటల్ జట్టు పూర్తిగా క్వారంటైన్ లోకి వెళ్ళింది అన్నది తెలుస్తుంది. ఇక ఇలా క్వారంటైన్ లోకి వెళ్లిన వారిలో ఆటగాళ్లు కూడా ఉండడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఆటగాళ్లతో పాటు సిబ్బందికి ఆర్ టి పి సి ఆర్ టెస్టులు  చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ టెస్టులో ఫలితాల ఆధారంగానే బుధవారం జరగబోయే మ్యాచ్ ఆధారపడి ఉంది అని చెప్పాలి. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొత్తం క్వారంటైన్     లోకి వెళ్లే అవకాశముంది. దీంతో మ్యాచ్ రద్దు అయ్యే ఛాన్సు కూడా ఉన్నాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: