రోహిత్ కి షాక్.. బ్యాన్ అయ్యే ప్రమాదం?

praveen
ఐపీఎల్ హిస్టరీ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎప్పుడు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండే ముంబై ఇండియన్స్ జట్టు ఈసారి మాత్రం అట్టడుగున మూలుగుతోంది. ఎందుకంటే ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. పసికూన లాంటి జట్ల పైన కూడా ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు ఓటమి చవి చూస్తుంది అని చెప్పాలి.


 దీంతో ముంబై ఇండియన్స్ అభిమానులు అందరూ కూడా తీవ్రంగా నిరాశ లో మునిగిపోతున్నారు. ఎందుకు ముంబై ఇండియన్స్ విజయం సాధించలేక పోతుంది అన్నది అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఇటీవలే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్ లో కూడా ముంబై ఇండియన్స్ జట్టుకు నిరాశే ఎదురయింది. ఐదు మ్యాచ్ లలో ఓడి పోయి పరాజయాల పరంపర కొనసాగిస్తూనే ఉంది. అయితే ఇక ఇలా విజయంతోనే నిరాశలో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కు ఊహించని షాక్ తగిలింది. గతంలోనే స్లో ఓవర్ రేట్ కారణంగా రోహిత్ శర్మ కు 12 లక్షలు జరిమానా పడింది.



 ఇటీవలే బెంగుళూరులో జరిగిన మ్యాచ్లో మరోసారి స్లో ఓవర్ రేట్ నమోదు కావడంతో ఏకంగా 24 లక్షల జరిమానా విధించారు బీసీసీఐ అధికారులు. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న అందరికీ కూడా ఆరు లక్షలు చొప్పున జరిమానా వేశారు. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటని పూర్తి చేయకపోవడం వల్లే జరిమానా  వేసినట్లు వివరణ ఇచ్చారు. ఇక అంతే కాకుండా కొత్త రూల్స్ ప్రకారం ఇలా స్లో ఓవర్ రేట్ నిబంధనలు మరోసారి బ్రేక్ చేస్తే ఏకంగా ఒక మ్యాచ్ పాటు రోహిత్ శర్మ పై బ్యాన్ విధించే అవకాశం కూడా ఉంది. దీంతో అటు ముంబై ఇండియన్స్ అభిమానులందరూ ఆందోళనలో మునిగిపోయారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: