వాషింగ్టన్ సుందర్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు.. వచ్చేసాడు?

praveen
కొత్త ఆటగాళ్లతో సరికొత్తగా ప్రస్థానాన్ని మొదలు పెడుతుంది అనుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో మాత్రం మొదటి రెండు మ్యాచ్ లలో తీవ్రంగా నిరాశపరిచింది. వరుసగా రెండు మ్యాచ్లలో ఓటమిని చవి చూడటం తో ఇక హైదరాబాద్ ఆట తీరు మారలేదు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత రెండు మ్యాచ్ ల్లో మాత్రం అద్భుతంగా పుంజుకుని విజయాన్ని సాధించింది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ లలో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలు పైకి దూసుకు వెళ్లడానికి సిద్ధమైంది. సన్రైజర్స్ ఆటగాళ్లు మళ్లీ ఫామ్ లోకి వచ్చారు అని అభిమానులు అందరూ కూడా ఆనంద పడుతున్న సమయంలో హైదరాబాద్ జట్టు కు ఊహించని షాక్ తగిలింది.

 సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆల్రౌండర్గా కొనసాగుతున్న వాషింగ్టన్ సుందర్ గాయం బారిన పడ్డాడు.  గాయం తీవ్రం కావడంతో చివరికి ఇక ఈ సీజన్ మొత్తం దూరం అయ్యాడు అన్న విషయం తెలిసిందే. వాషింగ్టన్ సుందర్ గాయ పడటంతో సన్రైజర్స్ కి భారీ ఎదురుదెబ్బ తగిలింది అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ స్థానాన్ని భర్తీ చేసే మరో ఆల్ రౌండర్ ని సన్రైజర్స్ యాజమాన్యం జట్టులోకి తీసుకుంది అని తెలుస్తోంది.


 ఆస్ట్రేలియా ఆల్రౌండర్ సీన్ అబాట్ తో ఇక వాషింగ్టన్ సుందర్ స్థానాన్ని భర్తీ చేయడానికి రెడీ అయిపోయింది జట్టు యాజమాన్యం. ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల జట్టుతో పాటు పాకిస్తాన్ లో పర్యటించిన అబాట్ క్వారంటైన్  ముగించుకుని ఇటీవలే సన్రైజర్స్ జట్టులో చేరాడు. నెట్స్లో చెమటోడ్చి మరి సాధన చేస్తూ ఉండటం గమనార్హం. అతను ప్రాక్టీస్లో మునిగితేలుతున్న వీడియోని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా ఈ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ని అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం 2.4 కోట్లకు సొంతం చేసుకుంది అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: