ఐపీఎల్ : సన్రైజర్స్ హైదరాబాద్ కు గుడ్ న్యూస్?

praveen
ఈ ఐపీఎల్ సీజన్ లో అయినా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ మాట తీరులో మార్పు చేసుకుంటుంది అని అందరూ అనుకున్నారు. జట్టులోకి కొత్త ఆటగాళ్లు రావడంతో ఇక సన్రైజర్స్ దశ తిరిగిపోతుంది అని భావించారు. కానీ ఈ ఐపీఎల్ సీజన్ లో కూడా అదే పేలవ ప్రదర్శన కొనసాగించి నిరాశ పరిచింది. వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోవడంతో ఇక సన్రైజర్స్ తీరు మారలేదు అని ఎంతోమంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత మ్యాచులలో మాత్రం ఊహించని రీతిలో పుంజుకుంది. ఇక వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి సత్తా చాటింది.

 అయితే ప్రస్తుతం ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న ఆటగాళ్లు మంచి ఫాంలోకి వచ్చిన తీరు చూస్తుంటే ఇక రానున్న రోజుల్లో కూడా మ్యాచ్ గెలవడం ఖాయం అన్న విధంగానే మారిపోయింది. ఇలాంటి సమయంలోనే సన్రైజర్స్ లో కీలకమైన ఆటగాడు దూరమయ్యాడు.  వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా దూరం కావడంతో సన్రైజర్స్ కి  షాక్ తగిలింది. విజయానందంలో ఉన్న హైదరాబాద్ జట్టుకు  ఇది గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి. కాగా ఇప్పుడు మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ కు ఒక గుడ్ న్యూస్ అందింది.

 ఇటీవలే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాటి  గాయపడిన విషయం తెలిసిందే. రాహుల్ తేవాటియా బౌలింగ్లో తొలి బంతికే అద్భుతమైన సిక్సర్ బాదిన రాహుల్ త్రిపాఠి తర్వాత కూడా తొడ కండరాలు పట్టేయడం తో ఫీల్డ్ నుంచి వైదొలిగాడు.  ఇక ఈ మ్యాచ్లో 11 మత్తులోనే 17 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఆ తర్వాత జరగబోయే మ్యాచ్ కి త్రిపాఠి అందుబాటులో ఉంటాడా లేదా అనే సందేహం అందరిలోనూ నెలకొంది. అయితే త్రిపాటి గాయంపై ఇటీవలే కేన్ విలియమ్సన్ అప్డేట్ ఇచ్చాడు. తదుపరి మ్యాచ్కి త్రిపాటి కోలుకుంటాడని విలియంసన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అదృష్టవశాత్తు అతనికి పెద్ద గాయం కాలేదు అని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: