అతని 10 కోట్లకు కొంటారు అనుకున్నా.. కానీ : ఆకాశ్ చోప్రా
మెగా వేలంలో అతని దక్కించుకోవడానికి లక్నో తో ఏ జట్టు పోటీ పడకపోవడంతో అతనికి భారీ ఇద్దరు పలకలేదని ఇక ఈ విషయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది అంటూ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 52 బంతుల్లో 80 పరుగులు సాధించి లక్నో విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు క్వింటన్ డికాక్. మెగా వేలంలో లక్నో అతని కొనుగోలు చేసి మంచి నిర్ణయం తీసుకుంది. అతను స్టార్ ప్లేయర్ అయినప్పటికీ మిగతా జట్లు ఎందుకు పోటీ పడలేదో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అతడు ఏకంగా పది కోట్లకు అమ్ముడు పోతాడు అని నేను ఊహించాను. కానీ అతడిని లక్నో జట్టు 6.75 కోట్లకు కొనుగోలు చేసింది.
మెగా వేలంలో అతనికీ అంత తక్కువ ధరకు కొనుగోలు చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. లక్నో జట్టు మాత్రం ఇతర జట్లతో పోటీపడి అతని దక్కించుకుని సరైన నిర్ణయం తీసుకుంది. అతను బ్యాటింగ్ లోనే కాదు వికెట్ కీపర్ గా కూడా అద్భుతంగా రాణిస్తాడూ. ఏకంగా నోర్జె లాంటి స్టార్ బౌలర్ కు సైతం క్వింటన్ డికాక్ కు చుక్కలు చూపించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఏకంగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసి లక్నో జట్టును విజయతీరాలకు నడిపించాడు అంటూ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా చెప్పుకొచ్చాడు. కొంతమంది మాజీ ఆటగాళ్లు కూడా క్వింటన్ డికాక్ ప్రదర్శనపై ప్రశంసలు కురిపిస్తున్నారు..