అద్భుతమైన ఇన్నింగ్స్ పై.. రస్సెల్ ఏమన్నాడో తెలుసా?
కోల్కతా నైట్ రైడర్స్ ఎంతో అలవోకగా ప్రత్యర్థి తమ ముందు ఉంచిన టార్గెట్ ను చేదించడం లో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆండ్రూ రస్సెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి చర్చించుకుంటున్నారు. మరోసారి రస్సెల్ తనకు తిరుగు లేదు అని నిరూపించాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఇలాంటి అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి ఆండ్రూ రస్సెల్ ఏమనుకుంటున్నాడు అతని మాటల్లోనే... ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంది.. ఇలాంటి అద్భుతాల కోసమే కదా క్రికెట్ ఆడుతూ ఉండేది. జట్టు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఏం చేయాలో ఏం చేయగలను నాకు బాగా తెలుసు.
సామ్ బిల్డింగ్స్ లాంటి ఆటగాడు సహకారం అందిస్తూ స్ట్రైక్ రోటేట్ చేయడం నాకు బాగా కలిసొచ్చింది. నా శక్తిసామర్థ్యాలు ఏమిటో నాకు తెలుసు నమ్మకం కూడా ఉంది అందుకే క్లిష్ట పరిస్థితి నుంచి జట్టును బయట పడేయాలి అని అనుకున్నాను. జట్టు ప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా సిద్ధం గానే ఉంటాను. బ్యాట్ తోనే కాదు బంతితో కూడా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను అంటూ ఆండ్రూ రస్సెల్ చెప్పుకొచ్చాడు.. పంజాబ్ కింగ్స్ తమ ముందు ఉంచిన 134 పరుగుల టార్గెట్ ను నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 14.4 ఓవర్లలోనే కోల్కతా నైట్రైడర్స్ జట్టు చేధించి అద్భుతమైన విజయాన్ని సాధించింది..