అతని వికెట్ తీయడం.. నా జీవితాన్నే మార్చేసింది : బ్రావో
జమైకాలో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఆ తర్వాత జరిగిన వన్డే మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఆ సమయంలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 9 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్యసాధనకు దిగిన భారత్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. అయితే 10 పరుగులు అవసరమైన సమయంలో ఆఖరి ఓవర్లో మూడు బంతులను యువరాజ్ సింగ్ బౌండరీకి తరలించాడు. దీంతో మూడు బంతుల్లో రెండు పరుగులు గా సమీకరణం మారిపోయింది. ఇక ఆ తర్వాత దురదృష్టవశాత్తు యువరాజ్ సింగ్ కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
దీంతో భారత జట్టు ఓటమి పాలు అయింది. అయితే ఇలా 93 పరుగులతో అద్భుతమైన ఫామ్లో యువరాజ్ సింగ్ ఉన్న సమయంలో అతని వికెట్ పడగొట్టడం అంటే అదొక అద్భుతం అని చెప్పాలి. అందరూ ఉత్కంఠగా ఏం జరుగుతుందో అని ఎదురు చూస్తున్న సమయంలో బ్రావో అద్భుతమైన బంతిని సంధించి అతని వికెట్ తీశాడు. అయితే ఆ రోజు యువరాజ్ సింగ్ వికెట్ తీయడమే.. నా జీవితాన్ని మార్చేసింది. ఇప్పటికీ నా కెరీర్లో ఆరోజు యువరాజ్ వికెట్ తీసిన బంతి నా ఫేవరేట్ అంటూ బ్రావో చెప్పుకొచ్చాడు.