అయ్యో.. కేఎల్ రాహుల్ ఇలా జరిగిందేంటి?

praveen
క్రికెట్ అంటేనే ఫన్నీ గేమ్.. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో అటు ప్రేక్షకులందరికీ నరాలు తెగే ఉత్కంఠ మాత్రమే కాదు కొన్ని కొన్ని సార్లు నవ్వు కొన్ని సన్నివేశాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక ఇలా క్రికెట్ మ్యాచ్ లో జరిగే కొన్ని సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇకపోతే ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ప్రేక్షకులందరూ ఎదురుచూసిన మెగా టోర్నీ ప్రారంభం అవ్వడమే కాదు ఇక ప్రతీ మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది.


 అయితే ఇక ఐపీఎల్ కారణంగా ఎంతోమంది ఆటగాళ్లు ఒక జట్టు నుంచి మరో జట్టు లోకి వెళ్లి పోవడం ఇక కొన్ని జట్ల లోకి కొత్త ఆటగాళ్లు కూడా ఎంట్రీ ఇవ్వడం తో ఏ జట్టు సామర్థ్యం ఎంత మేరకు ఉంది అనేది కూడా ప్రస్తుతం ప్రేక్షకుల ఊహకందని విధంగానే ఉంది అని చెప్పాలి. అయితే ఇక ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుతమైన ప్రదర్శన తో 210 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి లక్నో ముందు ఉంచింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు అద్భుతంగా రాణించింది.


 ఈ క్రమంలోనే ఇక భారీ లక్ష్యాన్ని ఛేదించి విజయఢంకా మోగించింది. అయితే ఇక ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగిపోతున్న సమయంలో ఒక ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ సమయంలో కె.ఎల్.రాహుల్ తొలి ఓవర్లోనే తన షూ పోగొట్టుకున్నాడు. ఇక ముంబైలో అధిక వేడిమి కారణంగా కె.ఎల్.రాహుల్ కు చెమట విపరీతంగా వచ్చింది. దీంతో పిచ్ పై పరిగెత్తుతున్న సమయంలో కె.ఎల్.రాహుల్ షూ మధ్యలో పడిపోయింది. ఇది గమనించినప్పటికి కేఎల్ రాహుల్ తన పరుగు పూర్తి చేశాడు. ఆ తర్వాత బ్రేక్ సమయంలో డీకాక్ అతని షూ తీసుకొచ్చి ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: