కోహ్లీ బౌలర్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే?
ఈ మ్యాచ్లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసింది కోల్కతా నైట్రైడర్స్ జట్టు. ఈ క్రమంలోనే బెంగుళూరు బౌలర్లు అందరూ కూడా కోల్కతా జట్టును కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో ఇక అటు కోల్కతా జట్టు కేవలం 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఇక లక్ష్యాన్ని ఛేదించి విజయఢంకా మోగించింది. ఇక బెంగళూరు జట్టు లో రూథర్ఫర్డ్ 28, షాబాజ్ అహ్మద్ 27 రాణించారు ఇక చివర్లో హర్షల్ పటేల్ 10 దినేష్ కార్తీక్ 7 బంతుల్లో 14 పరుగులతో విజయంలో కీలక పాత్ర వహించారు. అయితే హర్షల్ పటేల్ బ్యాటింగ్ లోనే కాదు అటు బౌలింగ్ లో కూడా అదరగొట్టాడు అని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ లో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ మ్యాచ్ లో వరుసగా రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన రెండో బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఇక ఇంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన మహమ్మద్ సిరాజ్ కోల్కతా నైట్రైడర్స్ పై 2020 ఐపీఎల్ సీజన్ లో రెండు మెయిడిన్ ఓవర్లు వేసి ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక ఇప్పుడు అదే బెంగళూరు జట్టు లో కొనసాగుతున్న హర్షల్ పటేల్ కోల్కతా నైట్రైడర్స్ జట్టు పై ఈ అరుదైన ఘనత సాధించడం గమనార్హం.