విజయానందంలో రిషబ్ పంత్.. అంతలోనే ఊహించని షాక్?

praveen
ప్రస్తుతం ఐపీఎల్ లో ఢిల్లీ కాపిటల్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు రిషబ్ పంత్. ఇక ఈ సారి ఢిల్లీ క్యాపిటల్స్ లో కి ఎంతో మంది కొత్త ఆటగాళ్లు వచ్చిన నేపథ్యంలో రిషబ్ పంత్  తన కెప్టెన్సీని తో ఎలాంటి మాయ చేయబోతున్నాడు అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూసారూ. ఇలాంటి సమయంలోనే ఐపీఎల్ లో భాగంగా రెండవ మ్యాచులో అటు ఢిల్లీ కాపిటల్స్ ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్లో అనుభవం ఉన్న రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అని అందరూ భావించారు. అయితే కెప్టెన్సీలో పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ రిషబ్ పంత్ మాత్రం  తనదైన శైలిలో జట్టును ముందుకు నడిపించాడు.

 ఈ క్రమంలోనే ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ ని సైతం తన తొలి మ్యాచ్ లోనే  ఓడించింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. ఇక ఏకంగా ఛాంపియన్ జట్టుపై ఢిల్లీ విజయం సాధించడంతో అభిమానులు అందరూ కూడా సంబరాల్లో మునిగిపోయారు. కానీ అంతలోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఒక బ్యాడ్ న్యూస్ అందింది. ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ఆటగాడు స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్స్ కి గాయం అయినట్లు ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సారథి ఆరోన్ ఫించ్ వెల్లడించాడు. ప్రాక్టీస్  స్టేషన్ సందర్భంగా మిచెల్ మార్ష్  కి తొడ కండరాలు పట్టేసినట్లు పేర్కొన్నాడు.

 ఈ క్రమంలోనే మిచెల్ మార్ష్  పాకిస్థాన్తో జరగబోతున్న పరిమిత ఓవర్ల సిరీస్ మొత్తానికి దూరం కాబోతున్నాడు అని ఫించ్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఇటీవలే మిచెల్ మార్స్ కి అయిన గాయం కనుక పెద్దది అయితే ఇక ఐపీఎల్ 2022 సీజన్ ఆడటం కూడా అనుమానమే అన్నది తెలుస్తుంది. ఈ వార్త తెలిసి ఒక్కసారిగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఉలిక్కి పడింది అనే చెప్పాలి. ఎందుకంటే ఇక ఈ స్టార్ ఆల్రౌండర్ జట్టు లోకి వచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఇతని 6.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: