వావ్.. క్రికెట్ లో 145 ఏళ్ళ రికార్డు బ్రేక్?

praveen
ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేస్తూ ఉన్నారు కొంత మంది ఆటగాళ్లు. పేలవ ప్రదర్శనతో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటే మరి కొంత మంది ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వెస్టిండీస్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. అసాధారణ బ్యాటింగ్తో ఏకంగా 145 ఏళ్ల చరిత్ర తిరగరాశారు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు. నిజానికి వారిద్దరు బ్యాట్స్మెన్లు కాదు ఇంగ్లాండ్ జట్టు లో బౌలర్ లుగా కొనసాగుతున్నారు.


 వాళ్ళు ఎవరో కాదు జాక్ లీచ్, సాకిబ్ లు. ఇక ఇంతకీ ఏం జరిగిందంటే.. తొలి రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్ బౌలర్ల ధాటికి కుదేలయింది. ఓపెనర్ అలెక్స్ ఒక్కడే 31 పరుగులతో రాణించాడు. ఇక మిగతా టాపార్డర్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్లు అందరూ సింగిల్ డిజిట్ కే పరిమితం అయి వికెట్లు కోల్పోయారు. దీంతో ఏకంగా 27 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిందిm ఇక ఆ తర్వాత క్రిస్ ఒక్స్ 25 ఓవర్తన్ 14 పరుగుల తో కాసేపు ఆగిన ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ జట్టు లో బౌలర్ గా కొనసాగుతున్న జాక్ లీచ్ క్రీజులోకి వచ్చిన 41 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

 అతనికి మంచి సహకారం అందించిన సాకిబ్ 49 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇక ఇద్దరు  ఏకంగా పదో వికెట్కు 90 పరుగులు జత చేయడం గమనార్హం. దీంతో 89.4 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ అయింది ఇంగ్లాండ్ జట్టు. అయితే ఇంగ్లాండ్ బౌలర్లు జాక్ లీచ్ సాకిబ్ లు వెస్టిండీస్ బౌలర్ లను నిలువరిస్తూ తెగువ చూపించిన తీరు మాత్రం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ క్రమంలో 145 ఏళ్ల రికార్డులు తిరగరాశారు ఇద్దరు. 10 వికెట్ కు  ఎక్కువ పరుగులు జోడించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 1985 లో ఇంగ్లాండ్ కు చెందిన ఇద్దరు బౌలర్లు కూడా ఆఖరి వికెట్కు 81 పరుగులు జోడించారు. ఇప్పుడు వీరిద్దరు ఈ రికార్డును బ్రేక్ చేశారు అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: