ఐపీఎల్ : కెప్టెన్గా ధోనీ చివరి మాటలు ఇవే?
2019 వరల్డ్ కప్ తర్వాత జట్టు ఎంపికకు దూరంగా నే ఉన్నాడు మహేంద్రసింగ్ ధోని. ఇక కొన్నాళ్ళ పాటు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత జట్టులోకి పునరాగమనం చేస్తాడులే అని అందరూ అనుకున్నారు. మరోసారి అద్భుతంగా రాణించి ఇక 2020 లో జరిగే వరల్డ్ కప్ లో టీమిండియాకు మరో వరల్డ్ కప్ అందిస్తాడు అని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా 2020 ఆగస్టు 15వ తేదీన అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిస్తున్నట్లు చెప్పి అందరికీ షాకిచ్చాడు. సరే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కనీసం ఐపీఎల్ లో అయినా ధోని కెప్టెన్ గా చూడగలుగుతామ అని అందరూ అనుకున్నారు.
కానీ ఇప్పుడు ధోనీ చెన్నై కెప్టెన్సీ విషయంలో కూడా మళ్లీ అలాంటి షాక్ ఇచ్చాడు. ఇక ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకుని జట్టులో సీనియర్ ఆటగాడిగా కొనసాగుతున్న రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ ఇవ్వడం గమనార్హం. ఇకపోతే ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మాట్లాడిన చివరి మాటలు ఇవే అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. 2021 ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న తర్వాత మాట్లాడిన మహేంద్రసింగ్ ధోని జాబ్ డన్ అని చెప్పి ముగించేశాడు. ఇకపోతే 2008లో ఐపీఎల్ ప్రారంభం సీజన్లో చెన్నై ను రన్నరప్గా నిలిపిన నాటి నుంచి ఇక 2021లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిపేంత వరకు ధోనీ కెప్టెన్సీ ప్రస్థానం కొనసాగింది అని చెప్పాలి.