ఐపీఎల్ : అభిమానులకు గుడ్ న్యూస్?

praveen
బీసిసిఐ ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ నిర్వహించడానికి సిద్ధమైంది. ఇక రేపటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది అన్న విషయం తెలిసిందే. అయితే గతంలో కరోనా వైరస్ కారణంగా భారత్లో కాకుండా యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించింది బిసిసీఐ. దీంతో భారత అభిమానులు అందరూ ఎంతగానో నిరాశలో మునిగిపోయారు. అయితే ఈ సారి మాత్రం కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో భారత వేదికగానే ఐపీఎల్ నిర్వహిస్తామంటూ తెలిపింది.


 ఈ క్రమంలోనే ఇక మహారాష్ట్రలోని నాలుగు వేదికలో ఐపీఎల్ నిర్వహించడానికి సిద్ధమైంది బిసిసీఐ. దీంతో అభిమానులు అందరూ కూడా ఎంతో సంతోష పడిపోయారు. అంతా బాగానే ఉంది కానీ కరోనా వైరస్ ప్రభావం తగ్గింది కదా.. ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అనుమతిస్తారా ఇక మళ్లీ పాత రోజులు వచ్చి ప్రేక్షకులు ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించేందుకు అవకాశం ఉంటుందా లేదా అన్న దానిపై అటు అందరిలో ఓ టెన్షన్  కూడా  నెలకొంది. ఇక ఇలాంటి సమయంలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. 2022 ఐపీఎల్ సీజన్ కోసం అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.



 కానీ కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం కేవలం 25 శాతం మంది ప్రేక్షకులకు మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఇస్తామని ప్రకటన చేసింది బిసిసీఐ. అయితే కేవలం 25 శాతం మాత్రమే అనుమతి ఉండటంతో ప్రేక్షకులు కాస్త నిరాశ చెందినప్పటికీ కనీసం ఆ చాన్స్ అయినా వచ్చింది అని మరికొంతమంది మాత్రం ఆనందపడి పోతున్నారు. ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్ ను స్వయంగా వీక్షించే అవకాశం దక్కడంతో సంతోషంలో మునిగిపోయారు అభిమానులు. మార్చి 23 మధ్యాహ్నం నుంచి టికెట్ సేల్స్ ప్రారంభమైనట్లు ఐపీఎల్ పాలకమండలి వెల్లడించింది. ఇక ఐపీఎల్ మొదటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: