పక్కా ప్లాన్ తోనే అతన్ని జట్టులోకి తీసుకున్నాం : కోహ్లీ

praveen
బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో బాగా గుర్తింపు సంపాదించుకున్న జట్టు ఏది అంటే అందరూ చెప్పే పేరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. మొన్నటివరకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఐపీఎల్లో ప్రస్థానాన్ని కొనసాగించిన బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఎంతో మంది స్టార్ ప్లేయర్లు జట్టు లో ఉన్నప్పటికీ ఎందుకో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మాత్రం ఐపీఎల్లో అదృష్టం కలిసి రాలేదు అని చెప్పాలి. ఏకంగా టీమ్ ఇండియా లాంటి ఒక అంతర్జాతీయ జట్టును ముందుకు నడిపించే కోహ్లీ లాంటి కెప్టెన్ బెంగళూరుకు సారథిగా ఉన్నప్పటికీ టైటిల్ మాత్రం కొట్టలేకపోయింది.


 ఈ క్రమంలోనే తీవ్రస్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కొంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. దీంతో ఇక విరాట్ కోహ్లీ  జట్టుకు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం తో అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు. అయితే ఇక బెంగళూరు జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరు కాబోతున్నారు అని ఎన్నో రోజుల పాటు చర్చ జరిగింది. ఇక ఈ చర్చకు తెరదించుతూ ఇటీవలే మెగా వేలంలో 7 కోట్లు వెచ్చించి సొంతం తీసుకున్న ఫాబ్ డూప్లేసిస్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త కెప్టెన్ అంటూ ప్రకటించింది.


 ఈ క్రమంలోనే కొత్త కెప్టెన్గా డూప్లేసెస్ ఎంపిక కావడంపై విరాట్ కోహ్లీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పక్కా ప్లాన్ ప్రకారమే అతన్ని జట్టులోకి తీసుకున్నాము అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మెగా వేలంలో డూప్లెసిస్ ని ఎంచుకోవడం వెనుక స్పష్టమైన ప్రణాళిక ఉంది అని తెలిపాడు. దక్షిణాఫ్రికా జట్టుకు గతంలోనూ డూప్లేసిస్ సారథ్యం వహించాడు. కెప్టెన్గా ఎన్నో ఘనతలు కూడా సాధించాడు. అందుకే అతనికి ఆర్సిబి సారథ్య బాధ్యతలు కూడా అప్పగించాలని అనుకున్నాం. ఇక డూప్లెసిస్ ను జట్టులోకి తీసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని అంటూ విరాట్ కోహ్లీ తెలిపాడు. కోహ్లీ సారథ్యంలో ఇప్పుడు వరకు బెంగళూరు జట్టు కప్పు కొట్టలేదు. ఇక ఇప్పుడు కొత్త కెప్టెన్ తో అయిన లక్కు కలిసి వస్తుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: