భారత్ ముందు సవాల్.. చావో రేవో తేల్చుకోవాల్సిందే?
కెప్టెన్ మిథాలీ రాజ్ మరో బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్ అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. అయినప్పటికీ ఇక ఆ తర్వాత మిగతా ప్లేయర్స్ మాత్రం జట్టును సమర్ధవంతంగా ముందుకు నడిపించలేకపోయారు. ఈ క్రమంలోనే ఇక జట్టు ఓడిపోవడంతో ఇక ఇప్పుడు సెమీస్ అవకాశాలను భారత జట్టుకు ఎంతో క్లిష్టంగా మారిపోయాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత జట్టు సెమీస్ చేరుకోవాలి అంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇటీవల టాస్ గెలిచిన మిథాలీ సేన బ్యాటింగ్ ఎంచుకుంది.
అయితే ఇక సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవడం కి బంగ్లాదేశ్ జట్టు పై భారీ విజయం సాధించడంతో పాటు ఈ నెల 27వ తేదీన సౌత్ ఆఫ్రికా తో జరగబోయే మ్యాచ్ లో కూడా విజయం సాధించాల్సి ఉంటుంది. కాగా మహిళా వరల్డ్ కప్ లో 5 మ్యాచ్లు ఆడింది భారత మహిళల జట్టు. పాకిస్తాన్ వెస్టిండీస్పై మాత్రమే విజయం సాధించగా.. న్యూజిలాండ్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. దీంతో మిథాలీ సేన ఏం చేయబోతుందో అన్నది ప్రస్తుతం ఉత్కంఠకు తెర లేపుతోంది..