కోహ్లీతో వివాదంపై.. గంభీర్ ఏమన్నాడో తెలుసా?
ఈ క్రమంలోనే అగ్రెసివ్ క్రికెటర్గా పేరు సంపాదించుకున్న గౌతం గంభీర్ ఇప్పటివరకు మైదానంలో ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎన్నోసార్లు ఇక ప్రత్యర్థులతో మాటల యుద్ధానికి దిగిన సందర్భాలు ఉన్నాయి. అదేసమయంలో మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం అటు మైదానంలో ఎంతో దూకుడుగానే వ్యవహరిస్తూ ఉంటాడు. ఇక పలుమార్లు ప్రత్యర్థులతో వాగ్వాదానికి దిగుతూ ఉంటాడు. అయితే ఈ ఇద్దరు అగ్రసీవ్ క్రికెటర్ల మధ్య ఒకానొక సమయంలో వాగ్వాదం జరిగింది అన్న విషయం చాలా మంది అభిమానులకు తెలుసు.
2013లో కోల్కతా జట్టు కెప్టెన్గా ఉన్నాడు గౌతం గంభీర్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. మ్యాచ్ జరుగుతున్న సమయంలో వీరిద్దరి మధ్య వివాదం జరిగింది. ఇక ఇటీవలే ఈ వివాదంపై స్పందించాడు గౌతం గంభీర్. తన సహచరులతో వ్యక్తిగతంగా విభేదాలు లేవని చెప్పుకొచ్చాడు. ధోనీ అంటే ఎంతో గౌరవం అంటూ తెలిపాడు. 2013లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీతో చోటుచేసుకున్న వాగ్వాదం పై కూడా స్పందించాడు. ఆరోజు కోహ్లీతో వాగ్వాదం జరిగిన సమయంలో అతనికి అతనిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చాడు. కెప్టెన్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు దూకుడుగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపాడు. ఇక కోహ్లీ విజయాలు తనను ఎక్కడ ఆశ్చర్యపరిచ లేదు అంటూ గౌతం గంభీర్ చెప్పుకొచ్చాడు..