వారెవ్వా.. ధోని జట్టు.. ప్రపంచ రికార్డ్?

praveen
ధోనీ జట్టు ఏంటి అద్భుతంగా రాణించడం ఏంటి.. ఇంకా ఐపీఎల్ స్టార్ట్ కాలేదు కదా అని అనుకుంటున్నారు కదా. ఐపీఎల్ స్టార్ట్ కాలేదు కానీ ధోనీ జట్టు మాత్రం అద్భుతంగా రాణించింది. ఏకంగా సరికొత్త చరిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీలో భాగంగా నాగాలాండ్ లో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సొంత జట్టు జార్ఖండ్ రికార్డుల మోత మోగిస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. ఒక వెయ్యి ఎనిమిది పరుగుల్ని సాధించింది జార్ఖండ్ జట్టు. అయితే ఇప్పుడు వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో వెయ్యికి పైగా లీడ్ సాధించిన ఏకైక జట్టుగా ప్రపంచ రికార్డును సృష్టించింది.. ఈ క్రమంలోనే 1948-49 లలో మహారాష్ట్ర 958 పరుగులు లీడ్ రికార్డుని బద్దలు కొట్టింది ఝార్ఖండ్ జట్టు.


 అదే సమయంలో ఈ మ్యాచ్ ద్వారా అటు ఝార్ఖండ్ ఒక అపప్రధ కూడా మూటకట్టుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 591 పరుగుల ఆధిక్యం లభించింది.అయినప్పటికి కూడా ఇక ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడనియకపోగా రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయకుండా ఆడి అభిమానుల చీత్కారాలు ఎదుర్కొంది. క్రీడా స్పూర్తికి విరుద్ధంగా రికార్డుల కోసమే జార్ఖండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ ఆడిందని ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంటుంది ఝార్ఖండ్ జట్టు. ఇక ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 880 పరుగులకు ఆలవుట్ అయింది ఝార్ఖండ్ జట్టు.  ఝార్ఖండ్ సాధించిన స్కోరు చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డులకెక్కింది.


 ఝార్ఖండ్ ఇన్నింగ్స్ లో భాగంగా మూడు శతకాలు మూడు అర్థ శతకాలు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే వికెట్ కీపర్ కుమార్ కుశగ్ర 266 పరుగులతో అదరగొట్టాడు. ఇక విరాట్ సింగ్ 105 పరుగులతో శతకం బాదాడు. నదిమ్ 177 పరుగులు చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో నాగాలాండ్ జట్టు కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది పరుగులకే కుప్పకూలి పోవడంతో ఝార్ఖండ్ జట్టు 591 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆదిక్యత  లభించడం గమనార్హం. ఇక ఏదేమైనా కొంతమంది ధోని జట్టు మంచి రికార్డు సృష్టించింది అనుకుంటుంటే.. మరికొంతమంది మాత్రం విమర్శలు చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: