చేతులెత్తేసిన టీమ్ ఇండియా.. స్కోర్ ఎంతో తెలిస్తే షాకే?
ఈ క్రమంలోనే గత మ్యాచ్ గణాంకాలను చూసుకుంటే ఇక ఈసారి మహిళల జట్టు అద్భుతంగా రాణించడంతో పాటు ప్రతీకారం తీర్చుకోవడం ఖాయం అని అందరూ నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఊహించని రీతిలో భారత మహిళల జట్టు పేలవ ప్రదర్శన చేసింది. ఏ దశలో కూడా కనీస ప్రదర్శన చేయలేకపోయింది. టీమిండియా బ్యాటింగ్ విభాగం మొత్తం పేకమేడలా కూలిపోయింది అనే చెప్పాలి. స్మృతి మందాన (35) హర్మన్ ప్రీత్ కౌర్ (14 ), రీచా ఘోష్ (33 )జులన్ గోస్వామి( 20) మినహా మిగతా వాళ్ళు సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం అయ్యారు.
దీంతో ఏకంగా 36.2 ఓవర్లలో 134 పరుగులు మాత్రమే చేసిన టీమిండియా మహిళల జట్టు ఆలవుట్ అయ్యింది. ఇక టీమిండియా ప్రదర్శన చూసి అటు అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు అనే చెప్పాలి. ఇక ఈ చిన్న టార్గెట్ తో అటు ఇంగ్లాండ్ జట్టుపై భారత జట్టు విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోగలదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టు ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ క్రమంలో ఇప్పటికే రెండు వికెట్లు కూడా కోల్పోయింది. అయితే ఇక భారత బౌలింగ్ విభాగం పట్టు బిగిస్తే సాధించలేనిది ఏదీ లేదు అంటూ అభిమానులు మాత్రం అనుకుంటూ ఉండటం గమనార్హం..