కేఎల్ రాహుల్ కి షాక్.. ఏడున్నర కోట్లు పోయినట్లేనా?

praveen
మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. ఐపీఎల్  ప్రారంభం నేపథ్యంలో ప్రస్తుతం అన్ని జట్లు కూడా తమ ప్రత్యర్థులను  ఎదుర్కొనేందుకు తమదైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. కానీ ఐపీఎల్ ప్రారంభానికి ముందు కొన్ని జట్లకు మాత్రం ఊహించని షాకులు తగులుతున్నాయి.  ఎందుకంటే ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ జట్టుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉండటం తో ఎన్నో ఫ్రాంచైజీలు షాక్ లో మునిగిపోతున్నాయి.



 ఇకపోతే ఈ ఏడాది ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇస్తుంది లక్నో సూపర్ జాయింట్స్ జట్టు. ఇక మొదటి ఏడాది టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇకపోతే మొన్నటివరకు పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్ ని ఇక తమ జట్టుకు కెప్టెన్గా రిటన్ చేసుకుంది అన్న విషయం తెలిసిందే. కాగా ఐపీఎల్ ప్రారంభానికి ముందే కొత్త జట్టు లక్నో సూపర్ జెంట్స్ కి ఇబ్బందులు మొదలయ్యాయి అన్నది తెలుస్తుంది. ఇటీవలే మెగా వేలంలో కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన చేసిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ ఇటీవల గాయం బారిన పడ్డాడు. ఇప్పటికే జట్టులో నాణ్యమైన పేసర్ ఎవరు లేరు అని అనుకుంటున్న సమయంలో ఇక ఇప్పుడు మార్క్ వుడ్ కూడా గాయం బారిన పడడం మరింత కలవరపెడుతుంది.


 ఇటీవల వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో మొదటి టెస్ట్  మూడోరోజు ఆట లో భాగంగా బౌలింగ్ చేస్తుండగా మార్క్ వుడ్ చేతికి గాయం అయింది. దీంతో నొప్పి భరించలేక పోయిన సదరు ఆటగాడు మైదానం వీడి వెళ్లిపోయాడు. తర్వాత మళ్లీ మైదానంలోకి రాలేదు. కేవలం డ్రెస్సింగ్ రూమ్ కి మాత్రమే పరిమితం అయ్యాడు. దీంతో అతని గాయం తీవ్రత ఎలా ఉంది. మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ కి అందుబాటులో ఉంటాడా లేదా అన్న దానిపై మాత్రం ప్రస్తుతం లక్నో ఫ్రాంచైజీ లో  ఆందోళన మొదలైంది. మెగా వేలంలో మార్క్ వుడ్ ను ఏకంగా ముంబై ఇండియన్స్ తో పోటీపడి మరీ ఏడున్నరకు లో కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది లక్నో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: