ఐపీఎల్.. ఆ జట్టుకు కోచ్ గా మలింగ?
అయితే ఇప్పటి వరకు జరిగిన విధంగా కాకుండా సరికొత్త రీతిలో ఐపీఎల్ జరిపేందుకు సిద్దం అయ్యారు బీసీసీఐ అధికారులు. ఈ క్రమంలోనే అటు అన్ని ఫ్రాంచైజీ లు కూడా తమ జట్టుకు ఎంతో వ్యూహాత్మకంగా బరిలోకి దింపేందుకు సిద్ధమయ్యయ్ అన్న విషయం తెలిసిందే. కేవలం జట్టులో ఉన్న ఆటగాళ్లు మాత్రమే కాదు కోచింగ్ సిబ్బందిని కూడా పరిగణలోకి తీసుకొని వ్యూహాత్మకంగానే ఐపీఎల్ లో బరిలోకి దిగి టైటిల్ కొట్టాలని సిద్ధంగా ఉన్నాయ్ అన్ని జట్లు. ఇకపోతే ఒకప్పుడు ఐపీఎల్ బెస్ట్ బౌలర్ గా పేరు సంపాదించుకున్న శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ ఐపీఎల్లో కోచ్ అవతారం ఎత్తాడు అన్నది అర్ధమవుతుంది.
ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు పడగొట్టి బెస్ట్ బౌలర్ గా గుర్తింపు సంపాదించుకున్న లసిత్ మలింగ రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా ఎంపిక అయ్యాడు అని తెలుస్తుంది
ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తమ సోషల్ మీడియా ఖాతాల్లో అధికారికంగా ప్రకటించారు. ఐపీఎల్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన మలింగ 122 మ్యాచ్ లలో 175 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఇక ఐపీఎల్ చరిత్రలోనే తక్కువ సమయంలో ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. అలాంటి మలింగా కోచ్ గా ఎంపిక అయ్యాడు అని చెప్పడంతో అభిమానులు అందరూ ఆనందంలో మునిగిపోయారు.