క్రికెట్ లోనే విచిత్రమైన రికార్డ్.. 28 ఏళ్ల తర్వాత?
ఇక ఈ మ్యాచ్ లో పలు రికార్డులు బద్దలయ్యాయి అని చెప్పాలి. సాధారణంగా జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉంటారు. అయితే పాకిస్థాన్ జట్టులో ఉన్న పది మంది ఆటగాళ్లు ఏదో ఒక దశలో మ్యాచ్లో ఉపయోగపడ్డారు. కొంతమంది బౌలింగ్ చేస్తే మరి కొంత మంది బ్యాటింగ్లో ఇంకొంతమంది ఫీలింగ్లో క్యాచ్ అందుకోవడం లాంటివి చేసి ఏదో ఒక విధంగా జట్టుకు పని చేసారు. కానీ అదే జట్టు లో ఉండి జుట్టుకు ఏ విధంగా ఉపయోగపడలేదు ఒక ఆటగాడు. అతని పేరే పవాద్ ఆలం. ఐదు రోజుల పాటు టెస్ట్ మ్యాచ్ ఆడిన పవాద్ ఒక్కసారి కూడా బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ లో క్యాచ్ లు పట్టడం అవకాశాలు కూడా అతనికి రాలేదు.
ఇలా జట్టుకు కనీసం బౌలింగ్లో బ్యాటింగ్ లో ఫీల్డింగ్ లో ఉపయోగపడని పవాద్ 28 ఏళ్ళ రికార్డులు బద్దలు కొట్టాడు. 1994లో ఆసిఫ్ ముస్తఫా కు ఇదే పరిస్థితి ఎదురైంది. న్యూజిలాండ్తో జరిగిన అప్పటి టెస్ట్ మ్యాచ్లో ఆసిఫ్ ఒక్కసారి కూడా బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ చేయకపోవడం గమనార్హం. ఇప్పుడు పవాద్ ఆలం కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. చాయ్ తాగావ్ బిస్కెట్లు తిన్నాను ఇంకా ఏమీ చేయలేదు అదృష్టం అంటే నీది అంటూ కామెంట్లు పెడుతున్నారు.