కోహ్లీ అలా అనడంతో షాక్ అయ్యా : సచిన్

praveen
ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో ఎన్నో అద్భుతమైన రికార్డులను కొల్లగొట్టినా విరాట్ కోహ్లీ మరికొన్ని రోజుల్లో 100వ టెస్ట్ మ్యాచ్  మైలురాయిని కూడా అందుకో బోతున్నాడు అన్న విషయం తెలిసిందే. భారత క్రికెట్లో కేవలం కొంతమంది క్రికెటర్లకు మాత్రమే సాధ్యమైన100 టెస్టుల రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు విరాట్ కోహ్లీరెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే ఇక 100 టెస్ట్ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి ప్రేక్షకులను ఆకర్షించేందుకు విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ చెమటోడుస్తున్నాడు. ఇలా విరాట్ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.


 ముఖ్యంగా కోహ్లీ దాదాపు రెండు సంవత్సరాల నుంచి సెంచరీ చేయలేదు అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక విరాట్ కోహ్లీ నుంచి ఒక సెంచరీ కావాలని  అభిమానులు అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక విరాట్ కోహ్లీ వందవ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ దాహాన్ని కూడా తీరుస్తాడు ఏమో అని ఆశగా చూస్తున్నారు అభిమానులు. అయితే ఇక 100 టెస్ట్ మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటానికి కోహ్లీ నిర్ణయించుకున్నాడు అని తెలుస్తుంది.  ఇకపోతే విరాట్ కోహ్లీ 100వ టెస్ట్ గురించి ఎంతో మంది మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


 ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ 100 వ టెస్టు మైలురాయిని అందుకోవడం నేపథ్యంలో గుడ్ లక్ చెప్పాడు సచిన్ టెండూల్కర్. అదే సమయంలో గతంలో జరిగిన ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఓ రెస్టారెంట్ కి వెళ్లి నేను కోహ్లీ బాగా తిన్నాం.. కడుపు నిండుగా ఉంది.. అప్పుడు కోహ్లీ వచ్చి ఫిట్నెస్ పై దృష్టి పెట్టాలని ప్రాక్టీస్ కు వెళ్లాలని చెప్పడంతో ఆశ్చర్యపోయాను.. ఇప్పుడు అతని ఆరాటం గురించి నాకు అర్థమైంది. భవిష్యత్తు తరానికి స్ఫూర్తిని నింపడం కోహ్లీ భారత క్రికెట్కు చేసిన అత్యుత్తమ సేవ అంటూ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: