ధోనికి ఏమైంది.. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడూ?

praveen
అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్న ఆటగాళ్ల కంటే ఎక్కువ క్రేజ్ తో కొనసాగుతున్నాడు మహేంద్రసింగ్ ధోని. రిటైర్మెంట్  ప్రకటించిన తర్వాత కూడా ఊహించని రేంజిలో క్రేజ్ సంపాదించుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక ధోని కి సంబంధించి సోషల్ మీడియాలోకి ఏదైనా వచ్చింది అంటే చాలు అది క్షణాల్లో వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడు కొత్త లుక్ ట్రై చేస్తూ అభిమానులను ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు. ఇక ధోని ఏదైనా కొత్తగా ట్రై చేసాడు అంటే చాలు ఎంత అద్భుతంగా ఉందో అని అభిమానులు అందరూ అనుకుంటూ ఉంటారు.


 ఇక ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో సరికొత్త లుక్ లో ప్రత్యక్షమయ్యాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఈ కొత్త లుక్ చూసి అభిమానులు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని రీతిలో సోషల్ మీడియాలో దర్శనమిచ్చాడు మహేంద్రుడు. గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. ఇంతకీ ఈ కొత్త లుక్ దేనికోసం అని అనుకుంటున్నారు కదా.. ఇంకెందుకు మరి కొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కాబోతోంది. దీంతో ఐపీఎల్ 2022 సీజన్ ప్రమోషన్లో భాగంగా ధోని కొత్త లుక్లో దర్శనమిచ్చాడు. ఖాకీ చొక్కా ధరించి అదే కలర్ ప్యాంటు వేసుకుని మెలి తిరిగిన మీసాలతో కనిపిస్తున్నాడు.



 ఇంకా చెప్పాలంటే చెన్నై బస్ డ్రైవర్ యూనిఫామ్ ధరించి చేతిలో మైకు పట్టుకుని ఆటకు వేళాయె అన్నట్లుగా లుక్ ఇచ్చాడు మహేంద్రసింగ్ ధోని. ఇక చివర్లో కూలింగ్ గ్లాస్ పట్టుకొని బస్ స్టార్ట్ చేసి ధోని ఇచ్చిన లుక్  హైలెట్గా నిలిచింది అని చెప్పాలి. అయితే ఈ కొత్త లుక్లో ధోనీని సరిగ్గా గమనిస్తే తప్ప అక్కడున్నది ధోని అన్న విషయాన్ని గుర్తుపట్టలేక పోతున్నారూ అభిమానులు. అంతలా కొత్త లుక్ తో సర్ప్రైస్ చేశాడు మహేంద్రసింగ్ ధోని. ఇక దీనికి సంబంధించిన వీడియో వీడియో ని స్టార్ స్పోర్ట్స్ తమ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది  కాగా ఇప్పటికీ ఐపీఎల్లో నాలుగుసార్లు ఛాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి టైటిల్ కొట్టేందుకు సిద్ధమైంది.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: