నేడే తొలి టీ-20 మ్యాచ్.. లంక జట్టుకు ఊహించని షాక్?

praveen
కరోనా వైరస్ అనూహ్యంగా వెలుగులోకి వచ్చి క్రీడా రంగాన్ని మొత్తం కుదిపేసింది. రోజులు గడుస్తున్నాయి కానీ ఈ మహమ్మారి వైరస్ ప్రభావం మాత్రం తగ్గడం లేదు. దీంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా కారణం వైరస్ మాత్రం ఇబ్బందులు సృష్టిస్తోంది. బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా కేవలం ఒక హోటల్ గదికి మాత్రమే పరిమితం చేసి ప్రతి ఆటగాడు ని క్వారంటైన్ లో ఉంచుతూ వరుసగా అన్ని రకాల మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు.  అటు క్రికెట్ మ్యాచ్లు కూడా ఇదే తరహాలో జరుగుతున్నాయి. అయితే అటు క్రికెట్ బోర్డులు ఆటగాళ్లను క్వారంటైన్ లో ఉంచుతూ ఎంత కఠినమైన రూల్స్ మధ్య పెట్టినప్పటికీ ఏదో ఒక విధంగా కరోనా వైరస్ మాత్రం షాక్ ఇస్తూనే ఉంది.


 ఎంతమంది ఆటగాళ్లపై పంజా విసరడం చివరికి జట్టుకు దూరం చేయడం లాంటివి చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇటీవలే భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక జట్టులో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. నేటి నుంచి శ్రీలంక భారత్ మధ్య 20 సిరీస్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే.. ఇక ఈ టి 20 సిరీస్ ముగిసిన వెంటనే టెస్టు సిరీస్ ఆడుతాయి ఈ రెండు జట్లు. ఇకపోతే ఇక భారత్ టి20 సిరీస్ కి ముందు శ్రీలంక జట్టులో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. నేటి నుంచి తొలి టీ-20 మ్యాచ్ జరగనుండగా లంక జట్టులో కీలక స్పిన్నర్ గా కొనసాగుతున్న వానిందు హాసనరంగా కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. దీంతో అతడిని ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.



 కాగా రెండు వారాల వ్యవధిలోనే రెండుసార్లు హసరంగా వైరస్ బారిన పడటం చర్చనీయాంశంగా మారిపోయింది.  ఇకపోతే ప్రస్తుతం భారత్లో శ్రీలంక టి20 టెస్ట్ సిరీస్ లకు దూరమవుతాడా లేక త్వరగా కోలుకుని మళ్లీ జట్టులోకి అందుబాటు లోకి వస్తాడా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు హసరంగాను  10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం గమనార్హం. ఇటీవల జరిగిన మెగా వేలంలో వనిందు హసరంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన శ్రీలంక క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ఇక ఐపీఎల్ మార్చి చివరి వారం నుంచి ప్రారంభం అవుతుంది అంటూ టాక్ వినిపిస్తుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: