ఈసారి ప్రయోగాలు లేవు.. నేను బరిలోకి దిగుతా : రోహిత్

praveen
రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కడా తిరుగు లేదు అనే విధంగానే దూసుకుపోతున్నాడు. తనదైన కెప్టెన్సీ వ్యూహాలతో జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఇక రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా విజయం సాధిస్తూ వచ్చింది టీమ్ ఇండియా అనే విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల వెస్టిండీస్తో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వన్డే టి20 సిరీస్ ఆడింది. ఈ రెండు సిరీస్ లలో కూడా ప్రత్యర్థి వెస్టిండీస్ ను క్లీన్స్వీప్ చేయగలిగింది టీమిండియా.


 ఇక ఇప్పుడు ఇదే జోరు కొనసాగిస్తూ అటు శ్రీలంకతో ఈరోజు నుంచి టి20 సిరీస్ ఆడేందుకు సిద్దం అవుతుంది. ఇక శ్రీలంకపై రోహిత్ శర్మ ఎలాంటి ప్రయోగాలు చేయబోతున్నాడు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం జట్టులో కీలక ఆల్ రౌండర్ గా ఉన్న దీపక్ చాహర్ మరో ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కూడా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే ఇక రోహిత్ శర్మ వ్యూహాలను  ఎలాంటి అమలు లో పెట్టబోతున్నాడు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవల ఇదే విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ.


 శ్రీలంకతో ఆడబోయే టి20 సిరీస్ లో ఎలాంటి ప్రయోగాలు తావులేదని చెప్పుకొచ్చాడు. పరిమిత ఓవర్లలో ఓపెనర్ బ్యాట్స్మెన్ స్థానం కోసం ఎన్నో సార్లు ప్రయోగాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని అందుకే ఈసారి ఎలాంటి ప్రయోగాలు చేయకుండా ఓపెనర్ గా తానే బరిలోకి దిగుతానని అంటూ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. శ్రీలంక తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు వర్చువల్ మీడియా సమావేశం నిర్వహించగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. ఇక ఈ సమావేశంలో జట్టు కూర్పు ఎలా ఉండబోతుంది అనే దానిపై ఆసక్తి గల ప్రశ్నలు అడిగారు జర్నలిస్టులు.



 అయితే వెస్టిండీస్తో జరిగిన 3వ టి20 మ్యాచ్ లో యువ ఆటగాళ్లు కిషన్ కిషన్ రుతురాజ్ గైక్వాడ్ లు ఓపెనర్ జోడిగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు అన్న విషయం తెలిసిందే. కాగా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక శ్రీలంకతో ఆడబోయే సిరీస్ లో కూడా ఇలాంటి ప్రయోగాలు ఏమైనా చేయబోతున్నారా అంటూ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు... ప్రయోగాలు చేయడం లేదని తానే స్వయంగా బరిలోకి దిగుతా అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. కాగా రెండో వన్డే మ్యాచ్ లో తనతోపాటు మిడిలార్డర్ బ్యాట్స్మెన్ పంత్ కు ఓపెనర్ గా అవకాశం ఇచ్చాడు అన్న  విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: